
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు విచారణకు హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతివ్వడంతో ముంబై నుంచి వర్చువల్‌గా అల్లు అర్జున్ అటెండ్...
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు విచారణకు హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతివ్వడంతో ముంబై నుంచి వర్చువల్‌గా అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు.
హైదరాబాద్, జూన్ 22: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు విచారణకు హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతివ్వడంతో ముంబై నుంచి వర్చువల్‌గా అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు. ఈ కేసులో మిగిలిన నిందితులు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో అల్లు అర్జున్ను ఏ 11 గా పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. ఈరోజు(సోమవారం) ఉదయం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టు ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది.
సినిమా షూటింగ్‌ల కారణంగా అర్జున్ ముంబైలో ఉన్నారని, అక్కడి నుంచి వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాది మెమో దాఖలు చేయగా.. అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం నాంపల్లి కోర్టు ముందు అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా హాజరయ్యారు. దీన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసు తదుపరి విచారణను నాంపల్లి కోర్టు జులై 6కు వాయిదా వేసింది. ఆరోజు కూడా కోర్టుకు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరుకానున్నారా లేక వర్చువల్‌గానే అటెండ్ అవుతారా అనేది చూడాల్సి ఉంది.
SIR పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
30 నెలల్లో వినాశనం.. చీకటిని చూస్తేనే వెలుగుకు విలువ: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News