
శుక్రవారం నాటి నష్టాల నుంచి కోలుకుంటూ, ఈ వారం మొదటి రోజైన సోమవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో దలాల్ స్ట్రీట్ ఈరోజు ఆరంభం నుంచే...
శుక్రవారం నాటి నష్టాల నుంచి కోలుకుంటూ, ఈ వారం మొదటి రోజైన సోమవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో దలాల్ స్ట్రీట్ ఈరోజు ఆరంభం నుంచే పటిష్ఠంగా సాగింది.
ముంబై, జూన్ 22: గత వారం ఆఖరి రోజైన శుక్రవారం నాటి నష్టాల నుంచి కోలుకుంటూ, ఈ వారం మొదటి రోజైన సోమవారం (జూన్ 22) భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో దలాల్ స్ట్రీట్ ఈరోజు ఆరంభం నుంచే పటిష్ఠంగా సాగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ రెండు సూచీలు దాదాపు 0.38% మేర లాభపడ్డాయి.
ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ సూచీల వివరాలు ఇలా ఉన్నాయి. నిఫ్టీ 50 (NIFTY 50) సూచీ నేటి ట్రేడింగ్‌లో 89.80 పాయింట్లు (0.37శాతం) లాభపడి 24,102.90 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ (BSE SENSEX)సూచీ 291.17 పాయింట్లు (0.38శాతం) పెరిగి 77,094.07 వద్ద స్థిరపడింది.
ఈ ఉదయం మార్కెట్లు గ్యాప్-అప్ ఓపెనింగ్‌తో భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 24,106.60 వద్ద, సెన్సెక్స్ 77,160.67 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఈ క్రమంలో నిఫ్టీ 24,168.05 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకగా, సెన్సెక్స్ 77,325.56 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే, చివరి గంటలో ఒడిదొడుకుల వల్ల మధ్యాహ్నం 3 గంటల తర్వాత మార్కెట్లలో కొంత లాభాల స్వీకరణ (Profit Booking) కనిపించినప్పటికీ, సూచీలు తమ కీలకమైన మద్దతు స్థాయిలను కాపాడుకుంటూ గ్రీన్ జోన్లోనే ముగిశాయి.
‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో
ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి