
Neet Re Exam: దేశవ్యాప్తంగా నీట్ (NEET) యూజీ పునఃపరీక్ష అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆదివారం విజయవంతంగా జరిగింది. మే 3న జరిగిన తొలి పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయిన విషయం తెలిసిందే.
NTA issued clarification regarding the circulating reports that the NEET re-test paper was leaked.
Neet Re Exam: దేశవ్యాప్తంగా నీట్ (NEET) యూజీ పునఃపరీక్ష అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆదివారం విజయవంతంగా జరిగింది. మే 3న జరిగిన తొలి పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేవలం 37 రోజుల రికార్డు సమయంలో ఎన్టీఏ (NTA) ఈ రీ-టెస్ట్‌ను దిగ్విజయంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరైన ఈ పరీక్షను, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీ నుంచి స్వయంగా సమీక్షించారు.
GO 45: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 95 శాతం పోస్టులు స్థానికులకే.. జీవో 45 జారీ
అయితే, ఈ రీటెస్ట్(Neet Re Exam) ప్రశ్నపత్రం కూడా లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతోంది. ఆ విషయంపై తాజాగా ఎన్టీఏ స్పందించింది. ఆ వీడియో ముమ్మాటికీ నకిలీదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేసింది. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసేందుకే కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎన్టీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అవాస్తవాలను సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఇలాంటి నకిలీ వార్తలను నమ్మవద్దని, సోషల్ మీడియాలో వాటిని షేర్ లేదా ఫార్వార్డ్ చేయొద్దని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. కేవలం అధికారిక వెబ్సైట్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. అన్ని ప్రభుత్వ విభాగాల సహకారంతోనే ఈ పునఃపరీక్షను ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేయగలిగామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ వెల్లడించారు. దీనికి 5 బెస్ట్ ఇంగ్లీష్ URL ఇవ్వు