
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర (Yogandhra)- 2026 సామూహిక ఆరోగ్య, యోగా ఉద్యమం చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. లండన్‌కు చెంది
న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (World Book of Records) లో స్థానం సంపాయించుకుంది. ఈ రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్షిణ ప్రాంత సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఎలియాజర్ (Ullaji Eliazar) సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు అందజేశారు. కాగా, చంద్రబాబు దీనిని ఆయూష్ శాఖకు ఇచ్చి అభినందించారని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. యోగాంధ్ర-2026 ద్వారా రాష్ట్రంలో 1.05 కోట్ల మంది యోగా ఔత్సాహికులను భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆ లక్ష్యాన్ని అధిగమించి, ఏకంగా 1.07 కోట్ల మంది రిజిస్ర్టేషన్లు చేసుకున్నట్టు తెలిపారు. యోగాను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు 7,745 మంది యోగా మాస్టర్ ట్రైనర్లు, 2.61 లక్షల మంది సాధారణ యోగా శిక్షకులు, 511 మంది యోగా గురువులు తమ సేవలు అందించారని ఆయూష్ శాఖ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు.