బీపీ ఎక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్, గుండె లయ తప్పడం వంటి సమస్యలు వస్తాయని డాక్టర్ సంజయ్ భట్, కార్డియాలజీ, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్,...
బీపీ ఎక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్, గుండె లయ తప్పడం వంటి సమస్యలు వస్తాయని డాక్టర్ సంజయ్ భట్, కార్డియాలజీ, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరు తెలిపారు.
బీపీ అధికం అవ్వడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.
బీపీ పెరగడం వల్ల కిడ్నీల్లో రక్తనాళాలు దెబ్బతింటాయి. దీని వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో పాటుగా, కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలు వస్తాయి.
బీపీ పెరగడం వల్ల కంటిలోని రెటీనాకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం దెబ్బతింటుంది. దీని వల్ల చూపు మందగిస్తుంది.
బీపీ పెరగడం వల్ల ఆలోచనా శక్తి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మతిమరుపు తీవ్రం అవుతుంది.
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి. ప్రాసెస్ ఫుడ్ తినొద్దు. ఉప్పు, ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల బీపీ మరింత పెరుగుతుంది.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీపీ అదుపులోకి వస్తుంది.
వారంలో కనీసం 5 రోజుల పాటు వ్యాయామం చేయండి. రోజుకి 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే బీపీ అదుపులోకి వస్తుంది.
అధిక బరువు వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. బరువు తగ్గడం వల్ల బీపీ అదుపులోకి వస్తుంది.