తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు యాక్నెతో పాటు మచ్చలు తొలగించడంలో సహాయపడతాయి. దీనికోసం తేనెలో కొద్దిగా దాల్చినచెక్క కలిపి పేస్ట్ చేయండి.
దీనిని ముఖానికి రాసుకుని
పసుపులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోండి. 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మొటిమలు, యాక్నె వల్ల ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.
వేపలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు చర్మంపై యాక్నె మచ్చలను తొలగిస్తాయి. దీనికోసం వేపాకులను పేస్ట్ చేసి ముఖానికి రాసుకుని కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే చాలు.
ఐస్ ముక్కలను శుభ్రమైన క్లాత్లో చుట్టి యాక్నె ఉన్నచోట కాసేపు ఉంచండి. ఇలా చేయడం వల్ల రక్త నాళాలు కుచించుకుపోయి నొప్పి, ఎరుపుదనం, మచ్చలు తగ్గిపోతాయి.
అలోవెరాలోని కూలింగ్, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు యాక్నె వల్ల ఏర్పడి మంటను తగ్గిస్తాయి. అలాగే మచ్చలు రాకుండా కాపాడుతాయి. దీనికోసం తాజా అలోవెరాను యాక్నెపై రాసి అరగంట తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు.
తొమ్మిది భాగాల నీళ్లలో ఒక భాగం టీ ట్రీ ఆయిల్ కలపండి. దీనిని కాటన్ స్వాబ్ సహాయంతో యాక్నె ఉన్నచోట రాసుకోండి. ఇది బ్యాక్టీరియాను చంపి మచ్చలు తొలగించడంలో సహాయపడుతుంది.
గ్రీన్ టీని టోనర్ లాగా వాడితే యాక్నె మచ్చలు ఈజీగా తొలగించవచ్చు. దీనికోసం గ్రీన్ టీని తయారుచేసి చల్లారిన తర్వాత కాటన్ ప్యాడ్ సహాయంతో ముఖానికి రాసుకుంటే చాలు.
ముల్తానీ మట్టి ముఖంపై ఉన్న జిడ్డును తొలగించంతో పాటు యాక్నె మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికోసం ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత క్లీన్ చేసుకుంటే మంచిది.
మూడు భాగాల నీళ్లలో ఒక భాగం యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి ముఖానికి రాసుకోండి. దీనివల్ల స్కిన్ పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. యాక్నె మచ్చలు తగ్గుతాయి. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు వెనిగర్ వాడకపోవడమే మంచిది.