
విదేశీ పళ్లు.. ప్రస్తుతం సూపర్ మార్కెట్ల నుంచి తోపుడు బండ్ల వరకు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. అయితే, ప్రతి పండు వెనుక ఉండే ‘కెమికల్ కథ’ మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో లేదా దెబ్బ తీయడంలో కీలకపాత్ర...
Jun 22 2026 12:59 PM | Updated on Jun 22 2026 1:02 PM
విదేశీ పళ్లు.. ప్రస్తుతం సూపర్ మార్కెట్ల నుంచి తోపుడు బండ్ల వరకు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. అయితే, ప్రతి పండు వెనుక ఉండే ‘కెమికల్ కథ’ మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో లేదా దెబ్బ తీయడంలో కీలకపాత్ర పోషిస్తోందన్న విషయం మీకు తెలుసా? హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో విదేశీ పండ్ల వినియోగం 5 ఏళ్లలో బాగా పెరిగింది. వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) లెక్కల ప్రకారం 2024–25లో రూ.8,500 కోట్ల విలువైన పండ్లు దిగుమతి అయ్యాయి. అమెరికా యాపిల్స్, న్యూజిలాండ్ కివీ, చిలీ చెర్రీలకు డిమాండ్ ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్
3, 4తో మొదలైతే ప్రమాదం... 9తో మొదలైతేనే భద్రం
పండ్లపై ఉండే ప్రైస్ లుక్–అప్ (పీఎల్‌యూ) కోడ్‌లోనే అసలు రహస్యం ఉంది.
4 అంకెలు.. 3 లేదా 4తో మొదలు: రసాయన ఎరువులతో పండించినవి.
5 అంకెలు.. 9తో మొదలు: 100 శాతం సేంద్రియం.
5 అంకెలు.. 8తో మొదలు: జన్యు మార్పిడి (జీఎమ్‌వో) పండ్లు. భారత్‌లో నిషేధం.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏమంటోంది అంటే.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రసాయన అవశేషాలతో కాలేయం, కిడ్నీలు దెబ్బ తింటాయి. పిల్లల్లో హార్మోన్ల సమస్యలు, పెద్దల్లో క్యాన్సర్ వస్తాయి. అమెరికా యాపిల్‌ను 6 నెలలు నిల్వ ఉంచేందుకు ‘డైఫినైల్ అమైన్’ వాడతారు. ఇది యూరప్‌లో నిషేధం.
స్టిక్కర్ కోడ్ చెక్ చేయండి కొనేముందు 5 సెకన్లు కేటాయించి స్టిక్కర్ చూడండి. 9తో మొదలయ్యే కోడ్ ఉంటేనే కొనండి. స్టిక్కర్ లేకుంటే ముట్టుకోవద్దు. గర్భిణులు, పిల్లలకు కెమికల్ పండ్లు వద్దని నిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నిబంధనలు ఏవి? భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో మాగబెడితే రూ.10 లక్షల జరిమానా, 6 నెలల జైలు విధించాలి. కానీ దిగుమతి పండ్లపై తనిఖీలు లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మనమే.
‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
సౌత్ సినిమా నయా సెన్సేషన్.. మమితా బైజు బర్త్‌డే స్పెషల్( ఫొటోలు)
'సలార్' కాటేరమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? (ఫొటోలు)
రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు)
హైదరాబాద్ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు)
శవం మీద పేలాలు వేరుకునే వాడివి.. నీది ఒక బ్రతుకేనా...
ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ఆ పాపను ఎన్ని చిత్రహింసలు పెట్టాడంటే.. CI నాగరాజుపై జడ శ్రవణ్ షాకింగ్ నిజాలు