
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Mahesh Babu Okkadu Re Release: మహేష్ బాబు హీరోగా తొలి బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘ఒక్కడు’ అని చెప్పాలి. ఒక్కడు తర్వాత హీరోగా మహేష్ బాబుకు తిరుగులేని స్టార్డమ్ వచ్చింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో యం.యస్.రాజు నిర్మించిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇక మహేష్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్లో మొదటి చిత్రం. ఈ సినిమా 2003 సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను స్మాష్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమా అప్పట్లోనే రూ. 25 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఔరా అనిపించింది.
తాజాగా ‘ఒక్కడు’ చిత్రాన్ని 4 K ఫార్మాట్లో రీ రిలీజ్ చేస్తున్నారు. సుమారు 23 యేళ్ల తర్వాత తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్‌గా ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి ప్లా్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన భూమికా చావ్లా కథానాయికగా నటించింది. మరోవైపు ప్రకాష్ రాజ్ అద్భుతమైన విలనిజం పండించాడు. ముఖేష్ రిషి, తెలంగాణ శకుంతల, అజయ్, గీత, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రాజన్, అచ్యుత్ తదితరులు కీలకపాత్రను పోషించారు. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించాడు.
ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు "ఒక్కడు..
మహేష్ బాబు కమర్షియల్ యాస్పెక్ట్స్ లో కర్నూలు కొండారెడ్డి బురుజు అంటే ‘ఒక్కడు’ సినిమా అన్నట్లు ఒక మార్క్ సృష్టించి ఇండస్ట్రీ అంతా షేక్ చేసింది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర అప్పటి సంక్రాంతి విజేతగా నిలిచి ఔరా అనిపించింది. తాజాగా ‘ఒక్కడు’ చిత్రాన్ని రాధా మాధవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో రామ కృష్ణ గారిచే జూన్ 26వ రీ రిలీజ్ చేయనున్నారు. గుణ శేఖర్ కెరియర్ లో అలాగే మహేష్ బాబు కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ మరోసారి అలరించేందుకు రానుంది.
‘ఒక్కడు’ 4Kలో చూసేందుకు ఎక్సైటింగ్ గా ఉన్నాను - రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్..
ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ... "ఒక్కడు, ప్రతి యేడాది మరింత క్రేజ్ పెంచుకుంటూ ఇప్పటికే ఎన్నోసార్లు రీ రిలీజ్ అయినప్పటికీ మరోసారి రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీన సినిమాను 4Kలో విడుదల చేస్తున్నారు. అందరిలాగా నేను కూడా ఈ సినిమాను చూసేందుకు చాలా ఉత్సాహాంగా ఎదురు చూస్తున్నాను. ప్రేక్షకులంతా ఈ సినిమాను మరోసారి 4Kలో చూసి మరోసారి కాసుల వర్షం కురిపించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.