
ఆ దేవుడే ఎదురై, ‘వరమిస్తాను, కోరుకో!’ అంటే.. ఆ దేవుడే ఎదురై, ‘వరమిస్తాను, కోరుకో!’ అంటే ఎలాంటి వరం, ఎలా కోరుకోవాలో చాలామందికి తెలియదు. అతితెలివి వరాలడిగి ఆత్మనాశం కొనితెచ్చుకొన్న అసురులెందరో ఉన్నారు.
Jun 22 2026 10:06 AM | Updated on Jun 22 2026 10:06 AM
ఆ దేవుడే ఎదురై, ‘వరమిస్తాను, కోరుకో!’ అంటే..
ఆ దేవుడే ఎదురై, ‘వరమిస్తాను, కోరుకో!’ అంటే ఎలాంటి వరం, ఎలా కోరుకోవాలో చాలామందికి తెలియదు. అతితెలివి వరాలడిగి ఆత్మనాశం కొనితెచ్చుకొన్న అసురులెందరో ఉన్నారు. ధర్మమైన వరం అడిగి, శుభపరంపరను సాధించిన ధర్మరాజులు అరుదు.
వనవాసంలో యక్షుడడిగిన యక్షప్రశ్నలన్నిటికీ ధర్మరాజు చక్కగా సమాధానాలిచ్చిన సందర్భంలో, ఆ యక్షుడు మెచ్చి, ‘ధర్మజా! ఇక్కడ చనిపోయి పడి ఉన్న నీ నలుగురు తమ్ముళ్ళలో ఒక్కరిని బ్రతికిస్తాను. ఎవరు కావాలో కోరుకో’ అని అడిగాడు. ‘నా తల్లి సంతానంలో నేను బ్రతికి ఉన్నాను. నా సవతి తల్లి మాద్రి
సంతానమైన నకులుడిని సజీవుడిని చేయటం ధర్మంగా ఉంటుంది’ అని కోరాడు ధర్మరాజు. యుధిష్ఠిరుడి ధర్మబుద్ధికి అబ్బురపడి, యక్షుడు ఆయన నలుగురు సోదరులనూ బ్రతికించాడు. ‘ధర్మజా! నేను యక్షుడిని కాదు. నిన్ను పరీక్షించేందుకు వచ్చిన ధర్మదేవతను. వరం అడగటంలో నీ ధర్మబుద్ధిని మెచ్చాను. నీ కోసం మరో వరం కూడా ఏదయినా కోరుకో’ అన్నాడు. ‘అయ్యా, మాతో పాటు అరణ్యంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడు అగ్నిని మథించుకొనేందుకు వాడే అరణి కొయ్యను, లేడి ఎత్తుకు పోవటం చేత మేం అయిదుగురమూ దానిని వెతుకుతూ వచ్చాం. దయతో దానిని ప్రసాదించు, చాలు’ అన్నాడు ధర్మజుడు.
‘అదెంతపని? మిమ్మల్ని పరీక్షించేందుకు లేడి రూపంలో వచ్చి, ఆ అరణిని తెచ్చింది నేనే!’ అని, ధర్మదేవుడు అరణిని ధర్మజుడికి అందించాడు. ‘ఇప్పటికీ నీ కోసం నువ్వు వరం కోరుకోలేదు కనుక నేనే, అయాచితంగా, మీకొక వరమిస్తున్నాను. మీ పన్నేండేళ్ళ అరణ్యవాసం నేడో, రేపో ముగియబోతున్నది. అజ్ఞాతవాసం అనే అతి క్లిష్టమైన కాలం ఆరంభం కాబోతున్నది.
మీరు మీకు అనువైన మారువేషాలు ధరించి, ఎవ్వరూ మిమ్మల్ని గుర్తించకుండా మీ అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇది నా వరం. ఇది కాక, నువ్వు కోరేదేమైనా ఉంటే అడుగు. అనుగ్రహిస్తాను!’ అన్నాడు ధర్మదేవత. ‘దేవా! ఇంతకంటె ఏం కావాలి? అయినా అడిగావు కనక, నా బుద్ధి ఎల్ల వేళలా ధర్మాన్నే అనుసరించి ఉండేట్టు అనుగ్రహించు’ అన్నాడు ధర్మజుడు. ధర్మనిష్ఠుడైన వాడికిక లోటేమిటి? ఎప్పుడు ఏ దేవతను ఏది కోరినా లభిస్తుంది! – ఎం. మారుతి శాస్త్రి
రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు)
హైదరాబాద్ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు)
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
నువ్వు ఎవడివి..? నీతో మాకు పనే లేదు... సాయి కృష్ణ కేసులో ఏం ప్లాన్ చేశావ్?
పవన్ టార్గెట్ ఎవరు..? సీఐ నాగరాజును ఎందుకు విచారించట్లేదు..?
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..