
దేశీయ కమోడిటీ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, అమెరికా- ఇరాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల్లో కనిపిస్తున్న...
దేశీయ కమోడిటీ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, అమెరికా- ఇరాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల్లో కనిపిస్తున్న పురోగతి వంటి విషయాలు దేశీయ కమోడిటీ మార్కెట్ల కదలికలపై స్పష్టమైన ప్రభావం చూపాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం, వెండి ధరలు క్రమంగా పుంజుకున్నాయి. కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు, వ్యాపారులలో ఆశలను రేకెత్తిస్తున్నాయి.ఆగస్టు డెలివరీకి సంబంధించి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ మార్కెట్ లో పసిడి ధర 0.39 శాతం మేర పెరిగి ప్రతి 10 గ్రాములకు రూ.1,48,120 వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా వెండి ఫ్యూచర్స్ కూడా 1.18 శాతం పెరుగుదలతో కేజీ రూ.2,36,620 వద్ద నమోదైంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి మార్గం సుగమమవుతుండటంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో స్విట్జర్లాండ్‌లో సాగుతున్న ఈ ఉన్నత స్థాయి శాంతి చర్చల ఫలాలు త్వరలోనే ఆచరణలోకి రానున్నాయని భావిస్తోన్నారు.భారతీయ రిటైల్ మార్కెట్లలో బంగారం ప్రధానంగా 24, 22 క్యారెట్ల ప్యూరిటీతో అమ్మకాలు సాగుతుంటాయి. సాధారణంగా 24 క్యారెట్ల బంగారాన్ని అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. ఆభరణాల తయారీలో మన్నిక, నాణ్యత కోసం సాధారణ కొనుగోలుదారులు 22 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. హైదరాబాద్, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ సహా ఇతర ప్రముఖ ప్రాంతాలలో నమోదైన బంగారం, వెండి ధరల తాజా రిటైల్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.ఏపీ మీదుగా చెన్నైకి ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: బుకింగ్ ఓపెన్చెన్నై..24 క్యారెట్లు- రూ. 14,836, 22 క్యారెట్లు - రూ. 13,599, 18 క్యారెట్లు - రూ. 11,369ముంబై..24 క్యారెట్లు - రూ. 14,651, 22 క్యారెట్లు- రూ. 13,430, 18 క్యారెట్లు - రూ. 10,988బెంగళూరు..24 క్యారెట్లు - రూ. 14,651, 22 క్యారెట్లు- రూ. 13,430, 18 క్యారెట్లు - రూ. 10,988హైదరాబాద్..24 క్యారెట్లు - రూ. 14,651, 22 క్యారెట్లు- రూ. 13,430, 18 క్యారెట్లు - రూ. 10,988విజయవాడ..24 క్యారెట్లు - రూ. 14,651, 22 క్యారెట్లు- రూ. 13,430, 18 క్యారెట్లు - రూ. 10,988విశాఖపట్నం..24 క్యారెట్లు - రూ. 14,651, 22 క్యారెట్లు- రూ. 13,430, 18 క్యారెట్లు - రూ. 10,988