
త్వరలో ఓ ఇంటివాడు కానున్న టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ మొదలైన పెళ్లి వేడుకలు జూన్ 24న వివాహం Akash Deep : టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.
బిహార్ రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లా శివసాగర్ మండల పరిధిలోని అతడి స్వగ్రామం అయిన బడ్డీలో ఆదివారం (జూన్ 21) రాత్రి సాంప్రదాయబద్దంగా తిలక్ వేడక జరిగింది. ఈ వేడుక కోసం గ్రామాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. క్రీడా, రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. అతిథుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేయగా, గ్రామ ప్రజలు తమ అభిమాన క్రికెటర్ ఆనందంలో భాగస్వాములయ్యారు. IND vs ENG : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే.. కోహ్లీ విషయంలో కీలక కండిషన్ भारतीय क्रिकेटर आकाश दीप के पैतृक गांव बड्डी में रविवार को तिलक चढ़ाने की रस्म निभाई जा रही है। तिलक में शामिल होने के लिए राज्य और जिले के विभिन्न क्षेत्रों से लोग पहुंच रहे हैं, जिससे गांव में उत्सव का माहौल है।#akashdeep — Aman Singh (@77_com7) June 21, 2026 కాగా.. ఈ వేడుకల ప్రారంభానికి ముందే జూన్ 16న బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి స్వయంగా ఆకాశ్ దీప్ ఇంటికి వెళ్లి క్రికెటర్ సహా ఆయన తల్లిదండ్రులను కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 24న వివాహం.. ఆకాశ్ దీప్ వివాహం డెహ్రీ సమీపంలోని మాణిక్పూర్ గ్రామానికి చెందిన అక్షితా రాజ్‌తో జరగనుంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. జూన్ 22న మెహందీ, 23న హల్దీ కార్యక్రమాలు నిర్వహించనుండగా.. జూన్ 24న వివాహ వేడుక జరగనుంది. వివాహానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాలు స్వగ్రామంలో నిర్వహించిన అనంతరం.. వారణాసిలోని ఓ ప్రముఖ హోటల్లో వధూవరులు పెళ్లి బంధంతో ఒక్కటవుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా అంగరంగ వైభవంగా జరగనుంది.