
Jammikunta: మృతి చెందిన గుమాస్తా కుటుంబానికి దాతల చేయూత జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పద్మశాలి వీధికి చెంది
న ఆడెపు లక్ష్మణ్ ఇటీవలే మృతి చెందగా మృతుడి పిల్లల ఉన్నత అభ్యాసం కోసం స్థానిక వేద పండితులు డింగరి హరికృష్ణ మాచార్యులు, స్థానిక వ్యాపారి గర్రెపల్లి అరుణ్ శ్రీ మార్కండేయ గ్రూప్ ఆధ్వర్యంలో దాతలు చేయుటతో విద్యా సహాయ నిధిని సేకరించారు.
దాతలు 1,36,000 విరాళాలను అందజేయగా ఆదివారం మృతుడి భార్య కావ్య కుమారుడు కార్తీక్, కూతురు సాహితికి అందజేశారు. సాహితి బీటెక్ రెండవ సంవత్సరం, కుమారుడు 9వ తరగతి విద్యాభ్యాసం చేస్తున్నారు. గుమాస్తాగా పనిచేస్తున్న లక్ష్మణ్ మృతితో పేద కుటుంబానికి సహాయం చేసేందుకు చేయూతనివ్వడంతో కూతురు పేరిట లక్ష రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను, రూ.36,000 నగదును అందజేశారు.
దాతలు, డింగరి హరికృష్ణ ఆచార్యులు, గర్రెపల్లి అరుణ్, కేదారేశ్వర్,బచ్చు వీరు లింగం, గుడిపాటి వీరారెడ్డి, అరుకాల వీరేశలింగం, విఠల్ దాస్, శ్యాంసుందర్, జి బలరాం, బొద్దుల రవీందర్ తదితరులు చేయూ తనిచ్చిన వారిలో ఉన్నారు వారి కుటుంబానికి అండదండగా ఉంటామని అన్నారు.