
బుధ గ్రహ సంచారం మిథున రాశి వారికి ఏమాత్రం మంచిది కాదు. ఈ సమయంలో మిథున రాశి వారి తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. గొడవలు కూడా మొదలవుతాయి.
ఈ సమయంలో ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లేకుంటే నష్టాలకు దారితీసే అవకాశం ఉంది. బుధ గ్రహం వల్ల కలిగే అశుభ ప్రభావాన్ని తప్పించుకోవాలనుకుంటే బుధవారం నాడు బ్రాహ్మణులకు పండ్లు దానం చేయండి.
వృశ్చిక రాశి వారికి బుధ గ్రహ సంచారం వల్ల జీవితంలో ఒడిదొడుకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం క్షీణించవచ్చు. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్న చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఆ విషయాలే నష్టాలను తెస్తాయి. విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. లేకపోతే చేసే పనుల్లో నష్టాలు కలగవచ్చు. బుధవారం నాడు ఎవరికైనా ఆకుకూరలను దానం చేస్తే మంచిది.
బుధ సంచారం సమయంలో మకర రాశి వారికి ప్రవర్తన, సంభాషణ చాలా మారిపోతుంది. వారు దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగం చేసే చోట ప్రతిష్ట దిగజారే అవకాశం ఉంది. ఇక పెళ్లయిన వారికి జీవిత భాగస్వామితో గొడవలు జరగవచ్చు. వీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. సంబంధాలలో చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూడటం మానుకోవాలి. అశుభ ప్రభావాలను అడ్డుకోవడానికి బుధవారంనాడు గణేష్ చాలీసా పఠిస్తే మంచిది.
కుంభ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధ గ్రహ ప్రభావం వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవనశైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నష్టాలు కలగవచ్చు. తొందరపాటు నిర్ణయాలు ఏవీ తీసుకోకూడదు. ఇక వీరు పరిహారంగా బుధ గ్రహ మంత్రాలను రోజూ జపిస్తే ఉత్తమంగా ఉంటుంది.