
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక A జట్టుపై సంచలన ఇన్నింగ్స్‌తో ముక్కోణపు సిరీస్ టైటిల్‌ను టీమ్ఇండియాకు అందించాడు వైభవ్ సూర్యవంశీ. కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసిన అతడు..
11 బంతుల్లో హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో ఇదే అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ ఇదే. శ్రీలంక ఆటగాడు కుశాల్య వీరరత్నే (12 బంతులు) 20 ఏళ్ల ముందు నెలకొల్పిన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. కేవలం టీ20లకే సెట్ అవుతాడనే వ్యాఖ్యలపై వైభవ్ స్పందించాడు. అలాగే ఈ సిరీస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు వెల్లడించాడు. లీగ్ స్టేజ్‌లో శ్రీలంక ప్లేయర్లతో వాగ్వాదం అనంతరం వైభవ్‌పై చాలా ఒత్తిడి ఉంటుందని అంతా భావించారు. కానీ, తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు.
‘‘రికార్డు గురించి నాకు తెలియదు. దాని గురించి ఆలోచించనూ లేదు. నా ప్రణాళికలు ఏంటో అమలు చేశా. తొలి పది ఓవర్లలో ఎలా ఆడాలనుకున్నానో అదే చేసి చూపించా. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ సిరీస్ ఆరంభంలో నేను అనుకున్న విధంగా ఆడలేదని తెలుసు. కోచ్‌లతో సంప్రదించాక.. రిథమ్‌ను అందుకొన్నా. నేను 50 ఓవర్ల క్రికెట్ చాలా ఆడా. ఆ విషయం ప్రజలకు తెలియదు. విభిన్న పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను తీసుకోవడం ఇష్టపడతా. ఇప్పుడు ఫైనల్లో మంచి ఇన్నింగ్స్ ఆడటం బాగుంది’’ అని వైభవ్ తెలిపాడు. అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
‘‘జట్టులోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారు. వరుస ఓటములు ఎదురైనా సరే.. కీలక సమయాల్లో రాణించి సత్తా చాటారు. లీగ్ స్టేజ్‌లో భారీ తేడాతో అఫ్గాన్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాం. వైభవ్- ఆర్య మంచి ఆరంభం ఇచ్చారు. లోయర్ ఆర్డర్లోనూ మాకు మంచి హిట్టర్లు ఉన్నారు. జట్టులోని ప్రతి ఒక్కరికీ దేశవాళీలో చాలా మ్యాచులను ఆడిన అనుభవం ఉంది. మేం విజేతలుగా నిలిచినా.. బౌలింగ్ విషయంలో ఇంకాస్త మెరుగు కావాల్సిన అవసరం ఉంది’’ అని ఇండియా ఏ కెప్టెన్ తిలక్ వర్మ వెల్లడించాడు. శ్రీలంక సారథి సహన్ ఆరాచ్చిగే కూడా వైభవ్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురిపించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.