
1,125 కిలోల స్వాధీనం.. ముగ్గురు నిందితుల పట్టివేత పట్టుబడిన గంజాయి, నిందితులతో ఎన్సీబీ అధికారులు ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి తవుడు బస్తాల మాటున తరలిస్తున్న...
1,125 కిలోల స్వాధీనం.. ముగ్గురు నిందితుల పట్టివేత
పట్టుబడిన గంజాయి, నిందితులతో ఎన్సీబీ అధికారులు
ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి తవుడు బస్తాల మాటున తరలిస్తున్న గంజాయిని, ముగ్గురు నిందితులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు పట్టుకున్నారు. ఎన్సీబీ ఇంటెలిజెన్స్ అధికారి, సీఐ కిరణ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని చిత్రకొండ సమీపంలో జాన్బై ప్రాంతం నుంచి వ్యాన్‌లో తవుడు బస్తాల కింద గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో ఎన్సీబీ పోలీసులు ఆదివారం మాటువేసి వారిని పట్టుకున్నారు. వాహనంలో ఉన్న 1,125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముంచంగిపుట్టు మండలం పనస గ్రామానికి చెందిన వంతాల గోపాల్, కిల్లో అనంతరామ్‌తో పాటు ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా గోవిందపల్లికి చెందిన పురుషోత్తమ్ కొర్రాలను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని జాన్బై నుంచి ముంచంగిపుట్టు మీదుగా జైపూర్ తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. ముంచంగిపుట్టులో నివాసం ఉంటున్న కార్తీక్‌కు కొంత గంజాయిని చేరవేసి, మరికొంత జైపూర్‌లో ఉన్న కుమార్ వద్దకు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. జైపూర్‌లోని కుమార్ పరారయ్యాడని సీఐ కిరణ్‌బాబు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.