
సోషల్ మీడియాలో చూసి ఇళ్లను అందంగా అలంకరించుకునే ట్రెండ్‌కు నెమ్మదిగా కాలం చెల్లుతోంది. ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే "ఫాస్ట్ ఇంటీరియర్స్" స్థానంలో ఇప్పుడు "స్లో ఇంటీరియర్స్" అనే కొత్త...
సోషల్ మీడియాలో చూసి ఇళ్లను అందంగా అలంకరించుకునే ట్రెండ్‌కు నెమ్మదిగా కాలం చెల్లుతోంది. ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే "ఫాస్ట్ ఇంటీరియర్స్" స్థానంలో ఇప్పుడు "స్లో ఇంటీరియర్స్" అనే కొత్త విధానం ప్రాచుర్యం పొందుతోంది. ఫోటోలకు అందంగా కనిపించే వస్తువుల కన్నా, ఎక్కువ కాలం మన్నే, నాణ్యమైన వాటిని కొనుగోలు చేసేందుకే నేటితరం ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం వెలువరించింది.ఏమిటీ 'ఫాస్ట్' వర్సెస్ 'స్లో' ఇంటీరియర్స్?ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయంగా కనిపించే సోఫాలు, కర్టెన్లు వంటివి కొన్నాళ్లకే నాణ్యత కోల్పోయి, పాతబడిపోవడాన్ని చాలామంది గమనిస్తున్నారు. దీన్నే "ఫాస్ట్ ఇంటీరియర్స్" అంటున్నారు. దీనివల్ల ఫర్నిచర్ వృథా కూడా భారీగా పెరుగుతోంది. అమెరికాలో ఏటా 12 మిలియన్ టన్నుల ఫర్నిచర్ వ్యర్థాలుగా మారుతోందని అంచనా. భారతదేశంలోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తున్నా, దీనికి ప్రతిగా సుస్థిరమైన గృహోపకరణాల వైపు సుమారు 10 మిలియన్ల కుటుంబాలు ఇప్పటికే మారాయి."స్లో ఇంటీరియర్స్" అనేది ఒక ప్రత్యేకమైన డిజైన్ కాదు, అది ఒక ఆలోచనా విధానం. ఇంటిని ఒకేసారి కాకుండా, నెమ్మదిగా, ఆలోచించి, దీర్ఘకాలం పాటు నిలిచిపోయే వస్తువులతో నిర్మించుకోవడం దీని ఉద్దేశం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, ఇది మనకు కొత్తేమీ కాదని, తరతరాలుగా మన ఇళ్లలో వాడే మంచాలు, పెట్టెలు, వస్త్రాలు ఈ కోవలోకే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. టెక్స్టైల్ నిపుణురాలు స్మితా జోషి మాట్లాడుతూ, ఇది భారతీయ కుటుంబాల్లో ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయమేనని గుర్తుచేశారు.కరోనా మహమ్మారి తర్వాత ఇళ్లే ఆఫీసులుగా, పాఠశాలలుగా మారడంతో నాణ్యత