
ఎప్రిలియా ఇండియా.. టుయోనో 457 స్పెషల్ ఎడిషన్‌ను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీని ధర రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కోసం ఎంపిక చేసిన షోరూమ్‌లలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
Jun 21 2026 8:41 PM | Updated on Jun 21 2026 8:41 PM
ఎప్రిలియా ఇండియా.. టుయోనో 457 స్పెషల్ ఎడిషన్‌ను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీని ధర రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కోసం ఎంపిక చేసిన షోరూమ్‌లలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
కొత్త ఎప్రిలియా టుయోనో 457 స్పెషల్ ఎడిషన్ 2006 ట్యూనో 1000R నుంచి తీసుకున్న రెండు కొత్త లివరీలను పొందింది. అంతేకాకుండా.. ఈ మోటార్‌సైకిల్‌లో కొన్ని ఎర్గోనామిక్ మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది.
స్పెషల్ ఎడిషన్ టుయోనో 457, కొత్త గ్రాఫిక్స్ డిజైన్, లోగోలతో పాటు, మాంబా బ్లాక్ అండ్ పూమా గ్రే అనే రెండు కొత్త రంగులలో లభిస్తుంది. కొత్త స్మోక్డ్ ఫినిష్ ఏరోడైనమిక్ ఫ్లైస్క్రీన్, నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్ కోసం ఎత్తుగా అమర్చిన హ్యాండిల్బార్లు ఉన్నాయి. సుదూర ప్రయాణాలలో మరింత సౌకర్యం కోసం ఈ స్పెషల్ ఎడిషన్ సీటులో మార్పులు చేశారని, అలాగే భారతీయ రోడ్లపై మెరుగ్గా పనిచేసేలా సస్పెన్షన్‌ను కూడా మెరుగుపరిచినట్లు ఎప్రిలియా చెబుతోంది.
ఇంజిన్ విషయానికి వస్తే.. ఎప్రిలియా పవర్‌ప్లాంట్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. కాబట్టి టుయోనో 457 బైక్ 46.9 bhp పవర్, 43.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో కొనసాగుతోంది.
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)
జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
మాట మార్చింది నువ్వు.. డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..? ఆ రోజు ఏం చెప్పారు..