
దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్‌తో పాటు టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమా 'బాహుబలి'. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రెండు పార్ట్ రిలీజైంది. దాంతో ఈ ఫ్రాంచైజీ సంగతి అక్కడితో అయిపోయిందని అంతా అనుకున్నారు.
Jun 21 2026 9:06 PM | Updated on Jun 21 2026 9:06 PM
దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్‌తో పాటు టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమా 'బాహుబలి'. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రెండు పార్ట్ రిలీజైంది. దాంతో ఈ ఫ్రాంచైజీ సంగతి అక్కడితో అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ దీని నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఇప్పుడు మరో 'బాహుబలి'ని నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సర్ప్రైజ్ ఇచ్చారు.
(ఇదీ చదవండి: సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి)
రెండు భాగాలుగా 'బాహుబలి'ని రిలీజ్ చేశారు. మూడో పార్ట్ వస్తుందని అంటున్నారు గానీ దీనిపై ఎవరికీ నమ్మకం లేదు. మరోవైపు ఈ రెండు పార్ట్స్ కలిపి ఎపిక్ పేరిట గతేడాది థియేటర్లలో రిలీజ్ చేశారు. దీనికి కూడా బాగానే రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు 'బాహుబలి' పేరుతోనే యానిమేటెడ్ సిరీస్ నిర్మాణంలో ఉంది. దీని ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఇప్పుడు 'బాహుబలి: ద టార్చ్ బేరర్' పేరిట ఓ డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ శుక్రవారం(జూన్ 26) నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.
అయితే ఇదంతా చూస్తున్న పలువురు నెటిజన్లు.. 'బాహుబలి' నుంచి ఇంకెన్ని దాచి ఉంచున్నారు అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలు తీసిన తర్వాత రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ చేశాడు. ఆస్కార్ సాధించాడు. ప్రస్తుతం మహేశ్ బాబుతో 'వారణాసి' చేస్తున్నాడు. దీని నుంచి అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఎదురుచూస్తుంటే 'బాహుబలి' నుంచి సర్ప్రైజులు రావడం చిత్రంగా ఉంది.
ఇప్పుడు రాబోయే 'బాహుబలి ద టార్చ్ బేరర్'లో ఇప్పటిదాకా చూడని మేకింగ్ ఫుటేజ్ తో పాటు ఈ ప్యాన్ ఇండియా మూవీకి చెందిన అరుదైన విశేషాలు అందులో చూపించబోతున్నారు. నిడివి తదితర వివరాలు వెల్లడించలేదు.
(ఇదీ చదవండి: 'ఓజీ 2' అప్డేట్.. ఆ డైరెక్టర్ని పవన్ పక్కనబెట్టేశారా?)
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)
జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
మాట మార్చింది నువ్వు.. డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..? ఆ రోజు ఏం చెప్పారు..