
మాంచెస్టర్: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158...
మాంచెస్టర్: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలి వర్మ (31; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. దీప్తి శర్మ (29), హర్మన్‌ప్రీత్ కౌర్ (24), స్మృతి మంధాన (17), యాస్తికా భాటియా (15), రిచా ఘోష్ (15), జెమీమా రోడ్రిగ్స్ (12) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ 2, మారిజెన్ కాప్ 2, మ్లాబా, అయాబొంగా ఖాకా, నాడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా గ్రూప్-ఎలో ఇవాళ సౌతాఫ్రికాతో భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచింది.
భారత్ తుది జట్టు: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, యాస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, నందని శర్మ.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నరీ డెర్క్సెన్, డేన్ వాన్ నీకెర్క్, మారిజెన్ కాప్, నాడిన్ డి క్లెర్క్, క్లో ట్రయాన్(వికెట్‌కీపర్), సినాలో జాఫ్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయాబొంగా ఖాకా, నాన్కులులేకో మ్లాబా.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ (TG20 League 2026) తొలి సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. టీజీ20 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హెచ్‌సీఏ ప్రతినిధులు, లీగ్‌లో భాగమైన ఎనిమిది ఫ్రాంఛైజీల కెప్టెన్లు, ఆటగాళ్లు, సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రత్యేక ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ ఫొటోలు మీకోసం..
పేపర్‌బాయ్ నుంచి రంజీ ప్లేయర్ వరకు ఎదిగి నేడు హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌కి ఆడుతుండటం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు మహబూబ్‌నగర్‌కి చెందిన గణేశ్ గడుగు.
తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభకు వెలుగులోకి తీసుకురావడం.. వారిని ఐపీఎల్, టీమ్ఇండియా వైపు నడిపించడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆరంభించిన టీజీ20 లీగ్ తొలికు సర్వం సిద్ధమైంది.