
ఏపీలో సోమవారం భారీ వర్షాలు. పిడుగులు పడే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూచన. Ap Rains: ఆంధ్రప్రదేశ్లో సోమవారం (జూన్ 22) పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల...
ఏపీలో సోమవారం భారీ వర్షాలు. పిడుగులు పడే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూచన. Ap Rains: ఆంధ్రప్రదేశ్లో సోమవారం (జూన్ 22) పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా కొన్ని చోట్ల స్వల్ప వ్యవధిలోనే భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో అక్రమాలు.. రంగంలోకి ప్రత్యేక దర్యాప్తు బృందం.. సీఎం యోగికి సిట్ ప్రాథమిక నివేదిక ఈ వర్షాల(Ap Rains) సమయంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండే వారు ఉరుములు ప్రారంభం కాగానే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. పొరపాటున కూడా చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, నీటి వనరుల సమీపంలో నిల్చోవద్దని గట్టిగా హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు కూడా ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. వరద నీరు ప్రవహించే వాగులు, కాలువలు దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేసింది. ప్రజలు పుకార్లను నమ్మకుండా కేవలం అధికారిక వాతావరణ హెచ్చరికలను మాత్రమే గమనిస్తూ, అత్యవసర సమయాల్లో స్థానిక యంత్రాంగాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.