
కన్యా రాశి : కన్యా రాశి వారికి శుక్ర కేతువుల కలయిక అనేక సమస్యలను తీసుకొస్తుంది. వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడుతాయి. విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇది కష్టాల సమయం.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఇది చాలా కష్ట కాల సమయం. అప్పులు పెరుగుతాయి. ఖర్చులు డబుల్ అవుతాయి. ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిలువదు. మాట్లాడే ముందు జాగ్రత్త అవసరం లేకపోతే కలహాలు జరిగే ఛాన్స్ ఉంది.
తుల రాశి : తుల రాశి వారికి ఇది మానసిక సమస్యలను తీసుకొస్తుంది. ఖర్చులు అధికం అవుతాయి. ఈ రాశి వారికి సహనం చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చిక్కుల్లో పడటం ఖాయం. అందువలన ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
మకర రాశి : రెండు గ్రహాల సంయోగం వలన ఈ రాశి వారికి అనేక సమస్యలు తీసుకొస్తుంది. శుక్ర గ్రహం, కేతు గ్రహం సంయోగం వలన ఆర్థికంగా చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అప్పుల బాధలు అధికం అవుతాయి. అందువలన వీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు