
200 – హర్మన్‌ప్రీత్ కౌర్, 184 – సూజీ బేట్స్, 183 – డానీ వ్యాట్-హాడ్జ్, 177 – ఎలీస్ పెర్రీ, 169 – స్మృతి మంధాన. పురుషుల T20Iలలో పాల్ స్టిర్లింగ్ (163) అగ్రస్థానంలో ఉండగా, అతని తర్వాతి స్థానంలో రోహిత్...
200 – హర్మన్‌ప్రీత్ కౌర్, 184 – సూజీ బేట్స్, 183 – డానీ వ్యాట్-హాడ్జ్, 177 – ఎలీస్ పెర్రీ, 169 – స్మృతి మంధాన.
పురుషుల T20Iలలో పాల్ స్టిర్లింగ్ (163) అగ్రస్థానంలో ఉండగా, అతని తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (159) ఉన్నారు.
220 – షార్లెట్ ఎడ్వర్డ్స్, 200 – హర్మన్‌ప్రీత్ కౌర్, 199 – హెదర్ నైట్, 195 – మిథాలీ రాజ్, 183 – చమరి అథపత్తు, 182 – మెగ్ లానింగ్.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నరీ డెర్క్సెన్, డేన్ వాన్ నీకెర్క్, మారిజాన్ కాప్, నాడిన్ డి క్లెర్క్, క్లో ట్రయాన్(కీపర్), సినాలో జాఫ్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయాబొంగా ఖాకా, నాన్కులులేకో మలాబా.
టీమిండియా ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, నందిని శర్మ, ప్రేమ రావత్.
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సౌతాఫ్రికా బౌలింగ్ చేయనుంది.
మరోవైపు, ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాకు చావో రేవో లాంటిది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే గెలిచింది.
నేటి మ్యాచ్‌తో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 200 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా కూడా నిలవనుంది.
భారత్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్థాన్‌ను 64 పరుగుల తేడాతో, నెదర్లాండ్స్‌ను 95 పరుగుల తేడాతో ఓడించింది.
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. మాంచెస్టర్‌లో సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్ స్థానానికి మరింత చేరువవుతుంది. అంతకు ముందు, బ్రిస్టల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో వెస్టిండీస్, శ్రీలంక జట్లు తలపడతాయి.
IND-W vs SA-W Live Score, ICC T20 Women’s World Cup: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. మాంచెస్టర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్లో భారత్ ఇప్పటికే పాకిస్థాన్‌ను 64 పరుగుల తేడాతో, నెదర్లాండ్స్‌ను 95 పరుగుల తేడాతో ఓడించి వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 200 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచారు. మరోవైపు, ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే గెలిచిన దక్షిణాఫ్రికాకు ఇది చావో రేవో లాంటి మ్యాచ్. మరోవైపు, ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాకు చావో రేవో లాంటిది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే గెలిచింది.
గత సంవత్సరం నవంబర్ 2న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి భారత్ తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది.