
ఈ రోజు (జూన్ 21) ఫాదర్స్ డే. సరిగ్గా ఈ రోజే యష్ హీరోగా నటిస్తున్న “టాక్సిక్” (Toxic) సినిమాకి సంబందించిన విడుదల తేదీని ప్రకటించారు. ఫాదర్స్ డే కాబట్టి ఈ రోజుని ఎంచుకొని కొత్త డేట్ ని ప్రకటించారు.
రిలీజ్ డేట్ పోస్టర్ లో కూడా ఇద్దరు యష్ లు ఉన్నారు.
ఈ సినిమాలో యష్(Yash) త్రండ్రిగా, కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకే, ఈ పోస్టర్లో రెండు పాత్రల లుక్స్ ని చూపించారు. కథ, థీమ్ తండ్రికొడుకుల చుట్టూ తిరుగుతుంది కాబట్టి విడుదల తేదీ ప్రకటించేందుకు ఫాదర్స్ డేని ఎంచుకొన్నారు. మరి విడుదల తేదీని ఆగస్టు 26 అని ఎందుకు ఫిక్స్ అయ్యారు?
దానికి కూడా కారణం ఉంది. వరమహాలక్ష్మి, ఓనం, ఈద్, రక్షాబంధన్ వంటి పండుగలతో పాటు లాంగ్ వీకెండ్, సెలవుల్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్దేశంతో ఈ టీం ఆ డేట్ ని ఫిక్స్ చేసింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ‘టాక్సిక్’కి పెరిగిన డిమాండ్‌తో లాంగ్ వీకెండ్, పండుగ సీజన్లు కలిసి వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.
దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ స్వీయ బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీని కన్నడ, హిందీ, ఆంగ్లం, తెలుగు, తమిళం, మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా మెయిన్ పాత్రల్ని పోషించారు.