Upcoming IPO: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో పబ్లిక్ ఇష్యూల సందడి మొదలైంది. మెయిన్ బోర్డు కేటగిరీ నుంచి ఈ వారం 3 కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ( ఐపీఓ)లకు వస్తున్నాయి.
ఈ ఐపీఓల ద్వారా నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటర్ వేస్ లీజర్ టూరిజం (కార్డెలియా క్రూయిజెస్), జైపూర్ కు చెందిన జువెలరీ కంపెనీ అద్వైత్ జువెల్స్, ఐటీ సొల్యూషన్స్ కంపెనీ సీఎస్ఎం టెక్నాలజీస్ కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. ప్యాకింగ్ సొల్యూషన్స్ అందించే న్యాక్ ప్యాకేజింగ్ వచ్చే వారమే ప్రైస్ బ్యాండ్ నిర్ణయించనున్నాయి.వాటర్ వేస్ లీజర్ టూరిజంవాటర్ వేస్ లీజర్ టూరిజం కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ.585 కోట్లు సమీకరించనుంది. ధరల శ్రేణిని రూ.769 నుంచి రూ.808గా నిర్ణయించారు. జూన్ 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సబ్స్క్రప్షన్ అందుబాటులో ఉండనుంది. పూర్తిగా షేర్లను ఫ్రెష్ ఇష్యూ ద్వారా జారీ చేయనున్నారు.అద్వైత్ జువెల్స్ ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.165.16 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 23వ తేదీన సబ్స్క్రిప్షన్ మొదలవుతోంది. జూన్ 25వ తేదీన ముగియనుంది. ధరల శ్రేణిని రూ.130 నుంచి రూ.138గా కంపెనీ నిర్ణయించింది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 1.20 కోట్ల ఈక్విటీ షేర్లను కంపెనీ చేరీ చేస్తోంది. అప్పులు తీర్చేందుకు, నిర్వహణ ఖర్చలకు ఈ డబ్బులు వినియోగించనుంది.ఐటీ కంపెనీ ఐపీఓఐటీ సేవల సంస్థ సీఎస్ఎం టెక్నాలజీస్ రూ.146 కోట్లను ప్రాథమిక మార్కెట్ నుంచి సమీకరించనుంది. ఒక్కో షేరు ధర రూ.107 నుంచి రూ.113గా నిర్ణయించారు. జూన్ 24వ తేదీ న ఈ సబ్స్క్రిప్షన్ మొదలై జూన్ 27 వ తేదీ వరకు కొనసాగనుంది. ఇది కూడా పూర్తి ఫ్రెష్ షేర్లను జారీ చేయనుంది. పెద్ద ఐపీఓలుక్విక్ కామర్స్ కంపెనీ జెప్టో ఐపీఓ ద్వారా రూ.10 వేల కోట్లు సమీకరించనుంది. అలాగే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.13 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ, రిలయన్స్ జియో సంస్థలు ముసాయిదా పత్రాలను సమర్పించాయి. దీంతో ఈ ఏడాది తొలి అర్ధభాగం స్తబ్దుగా ఉన్న ఐపీఓ మార్కెట్ రెండో అర్ధభాగంలో వేగం పుంజుకోనుంది.