
శ్రీలంక ఆతిథ్యమిచ్చిన అనాధికారిక ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్-ఎ జట్టు నిలిచింది. ఆదివారం దంబుల్లా వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక-ఎ జట్టును 66 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది.
Jun 21 2026 6:05 PM | Updated on Jun 21 2026 6:25 PM
శ్రీలంక ఆతిథ్యమిచ్చిన అనాధికారిక ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్-ఎ జట్టు నిలిచింది. ఆదివారం దంబుల్లా వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక-ఎ జట్టును 66 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ తుది పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చేసిన ఇండియా 'ఎ' జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ బాస్ బేబీ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ప్లేయర్‌గా వైభవ్ నిలిచాడు. ఓవరాల్‌గా 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్యవంశీ.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 94 పరుగులు చేశాడు.
అతడితో పాటు తిలక్ వర్మ(67), రుతురాజ్ గైక్వాడ్(40), అనుకుల్ రాయ్(15 బంతుల్లో 39), ప్రియాన్ష్ ఆర్య(39) రాణించారు. లంక బౌలర్లలో వనజా సహాన్, కుగదాస్ మతులన్, రవిందు ఫెర్నాండో తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ జట్టును భారత పేసర్ యశ్ ఠాకూర్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. అయితే మిడిల్ ఆర్డర్లో సదీర సమరవిక్రమ (52), సహన్ అరచ్చిగే(38) నిలకడగా ఆడడంతో లంక తిరిగి గేమ్‌లోకి వచ్చింది. రన్ రేట్ ఒత్తిడి పెరగడంతో శ్రీలంక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది.
ఆఖరిలో వనుజ సహన్ (62) దూకుడుగా ఆడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో 47.1 ఓవర్లలో 311 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయింది. రత బౌలర్లలో యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు అనుకుల్ రాయ్ రెండు, తిలక్ వర్మ, ఆశోక్ శర్మ చెరో వికెట్ సాధించారు. చదవండి: IND vs IRE: టీమిండియాకు భారీ షాక్
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)
జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
గచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద జెంబే డ్రమ్ సర్కిల్ ఈవెంట్ (ఫొటోలు)
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
మాట మార్చింది నువ్వు.. డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..? ఆ రోజు ఏం చెప్పారు..