
'కేజీఎఫ్' రెండు సినిమాల తర్వాత యష్ చేసిన మూవీ 'టాక్సిక్'. ఈ ఏడాది మార్చిలోనే థియేటర్లలోకి రావాలి కానీ షూటింగ్ సమస్యలతో వాయిదా పడింది. కట్ చేస్తే జూన్ 4న రిలీజ్ అన్నారు కానీ ఇది కూడా జరగలేదు.
Jun 21 2026 6:22 PM | Updated on Jun 21 2026 6:45 PM
'కేజీఎఫ్' రెండు సినిమాల తర్వాత యష్ చేసిన మూవీ 'టాక్సిక్'. ఈ ఏడాది మార్చిలోనే థియేటర్లలోకి రావాలి కానీ షూటింగ్ సమస్యలతో వాయిదా పడింది. కట్ చేస్తే జూన్ 4న రిలీజ్ అన్నారు కానీ ఇది కూడా జరగలేదు. అయితే ఈ ఏడాది అసలు దీన్ని విడుదల చేయరని, వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకొస్తారనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. దీంతో మేలుకున్న మూవీ టీమ్.. ఈ పుకార్లకు చెక్ పెడుతూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది.
(ఇదీ చదవండి: నా తండ్రి నా దేవుడు.. నాకు జీవితం ఇచ్చింది ఆయనే)
ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడ్డ 'టాక్సిక్'.. ఎట్టకేలకు ఆగస్టు 26న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అయితే రిలీజ్ రోజు బుధవారం. సాధారణంగా సినిమాల్ని శుక్రవారం విడుదల చేస్తుంటారు. మరీ కాదంటే గురువారం తీసుకొస్తుంటారు. కానీ యష్ మాత్రం కాస్త భిన్నంగా బుధవారం ఎంచుకున్నాడు. బహుశా వీకెండ్ లోపు ఎంతైతే అంత కలెక్షన్స్ రాబట్టేయాలని ప్లాన్ ఏమో? ఎందుకంటే పలుమార్లు వాయిదా పడటంతో ఈ మూవీపై బజ్ పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ రిలీజ్ ముంగిట ఏమైనా హైప్ తీసుకొస్తారేమో చూడాలి?
1980ల్లో గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్గా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తీశారు. ఇందులో యష్ సరసన కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా.. ఇలా ఐదుగురు హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఈ మూవీతో పాటు 'రామాయణ'లో యష్. రావణుడిగా విలన్ పాత్ర చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి)
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)
జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
గచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద జెంబే డ్రమ్ సర్కిల్ ఈవెంట్ (ఫొటోలు)
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
మాట మార్చింది నువ్వు.. డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..? ఆ రోజు ఏం చెప్పారు..