Swiggy Share Price: మిడ్ క్యాప్ కేటగిరిలోని ఫుడ్ డెలివరీ సెక్టార్ కంపెనీ స్విగ్గీ లిమిటెడ్ ( Swiggy Limited ) షేర్ భారీ నష్టాలని మిగిల్చింది. ఈ కంపెనీ షేర్ ఆల్ టైమ్ హై స్థాయి నుంచి రూ. 617.
30 మార్క్ నుంచి దాదాపు 60 శాతం పతనమైంది. ప్రస్తుతం రూ.253 వద్ద ట్రేడవుతోంది. స్విగ్గీ తమ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నా ప్రాఫిట్స్ విషయంలో బాగా వెనుకబడి నష్టాలని చవిచూస్తోంది. దీంతో గత కొన్ని రోజుల నుంచి ఈ కంపెనీ షేర్ ధర నష్టాల్లో ట్రేడవుతోంది. నిజానికి స్విగ్గి ఫుడ్ డెలివరీ వ్యాపారం బాగానే ఉన్నా, క్విక్ కామర్స్ బిజినెస్ ఇన్స్టామార్ట్ మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది. దీని ప్రభావం స్విగ్గీ బిజినెస్ పై పడుతోంది. మరోవైపు ఈ కంపెనీ షేరు గత ఏడాదిలో 35 శాతం నష్టాన్ని మిగిల్చింది.ఈ కంపెనీ స్టాక్ పనితీరు పరిశీలిస్తే, శుక్రవారంతో ముగిసిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో స్విగ్గీ లిమిటెడ్ షేరు 0.80 శాతం నష్టంతో రూ. 253.90 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 474 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 236.80 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 3 శాతం నష్టాన్ని, గత నెల రోజుల్లో ఈ షేరు 1 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఆరు నెలల్లో 38 శాతం నష్టాన్ని మిగిల్చింది. గత ఏడాది కాలంలో 35 శాతం నష్టపోయింది. గత ఏడాదిన్నర కాలంలో 41 శాతం నష్టపోయింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 58,150 కోట్ల వద్ద ఉంది.కంపెనీ ప్రొఫైల్ చూస్తే స్విగ్గీ లిమిటెడ్ దేశంలోని అతిపెద్ద ఫుడ్ డెలివరీ క్విక్ కామర్స్ కంపెనీల్లో ఒకటి. 2025 చివరి నాటికి దేశంలోని 700కి పైగా నగరాల్లో ఫుడ్ డెలివరీ సర్వీసులు అందిస్తోంది. 100 కంటే ఎక్కువ నగరాల్లో క్విక్ కామర్స్ సర్వీసులు అందిస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. డిసెంబర్ 26, 2013లో ఈ కంపెనీని ప్రారంభించారు.