
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Motorola Edge 60 Fusion 5g Huge Discount: మోటరోలా కంపెనీ ఎప్పటికప్పుడు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్ అత్యంత తక్కువ ధరల్లో విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్లో ఈ మొబైల్స్ ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఎక్కువగా ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను యువతే కొనుగోలు చేయడం విశేషం.. తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం కారణంగా.. సేల్స్ విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని మోటరోలా కంపెనీ ఎప్పటికప్పుడు మంచి మంచి మొబైల్స్ విడుదల చేస్తూ వస్తోంది.
ప్రస్తుతం మంచి డిమాండ్ కలిగిన మోటోరోలా మొబైల్స్‌లో Motorola Edge 60 Fusion 5G ఒకటి. దీనికి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. చాలామంది యువత ఈ స్మార్ట్‌ఫోన్ ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.. అత్యంత తక్కువ ధరలోనే ప్రీమియం కెమెరా సెట్ అప్ తో ఎన్నో రకాల ఫీచర్లతో అందుబాటులోకి రావడం వల్ల మొబైల్ మార్కెట్లో హైలెట్‌గా నిలిచింది.. మీరు కూడా ఎప్పటినుంచో Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం.. ఎందుకంటే దీనిపై ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ ఫ్లిప్కార్ట్అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేస్తే సగం కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్స్చేంజి బోనస్ ఆఫర్ వినియోగిస్తే చాలా చీప్ ధరకే పొందవచ్చు..
ప్రస్తుతం మార్కెట్లో 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ MRP ధర రూ.27,999 లకు విక్రయిస్తోంది. అయితే, దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ బ్యాంకు ఆఫర్స్‌లో భాగంగా.. దీనిని ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు తోపాటు ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది.
ముఖ్యంగా దీనిపై ఫ్లిప్‌కార్ట్ అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ అందిస్తుంది. ఇందులో భాగంగా మీ దగ్గర ఉన్న ఏదైనా పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే దాని కండిషన్‌ను బట్టి.. అలాగే ఆ మొబైల్ బ్రాండ్ ను బట్టి.. అదనంగా దాదాపు రూ.9 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ బోనస్ కొత్త మొబైల్ కొనుగోలు చేసే క్రమంలో వినియోగిస్తే..దాదాపు ఈ Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.1,7999 లోపే సొంతం చేసుకోవచ్చు..
ఇక ఈ Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో అద్భుతమైన 6.67 ఇంచుల Super HD+ (1.5K) pOLED క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దీన్ని డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్నెస్ సపోర్టును కలిగి ఉంటుంది. అలాగే ఈ స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం.. Corning Gorilla Glass 7i సపోర్టుతో అందుబాటులో ఉంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7400 (4nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. గేమింగ్‌తో పాటు మల్టీ టాస్టింగ్ కోసం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.. ఇది ఎంతో శక్తివంతమైన 5500 mAh బ్యాటరీ ను కలిగి ఉంటుంది. దీనికి కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 68W TurboPower సపోర్టును కూడా అందిస్తోంది.. అదేవిధంగా వెనక భాగంలో స్పెషల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉండడం విశేషం.
ఈ Motorola Edge 60 Fusion 5G మొబైల్‌కు సంబంధించిన కెమెరా సెటప్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో ప్రత్యేకమైన 50 MP ప్రధాన కెమెరా (Sony LYTIA 700C సెన్సార్, OIS సపోర్ట్)తో పాటు 13 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ (లింక్డ్ మేక్రో విజన్) కెమెరాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 32 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇవే కాకుండా మోటరోలా కంపెనీ ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్స్ ను కూడా అందిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.