
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Mother killed her two children in Khammam: దేశమంతట ఎక్కడ చూసిన ఫాదర్స్ డే సంబరాలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమను చిన్న తనం నుంచి భుజాల మీద ఎత్తుకుని పెంచిన కన్న తండ్రి త్యాగాలను పిల్లలంతా గుర్తు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో చాలా మంది పిల్లలు తమ తండ్రులకు సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. ప్రయోజకులైన పిల్లలను చూసి చాలామంది తండ్రులు కూడా పొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక తల్లి క్షణికావేశంలో భర్త మీద ఉన్న కోపం ఇద్దురు పిల్లలపై చూపించింది. ఎలుకల మందు తినిపించి మరీ హతమార్చింది. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.
ఖమ్మంలోని ఏదిలాపురం మున్సిపాలిటీ గుర్రాల పాడుకు చెందిన బొబ్బాల లింగరాజుతో చింత కానీ మండలం నరసిహపురానికి చెందిన స్వాతికి 9 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. లింగరాజు పాల వ్యాపారంతో పాటు ఖమ్మంలో మొబైల్ దుకాణంలో పనిచేస్తుండేవాడు. ఏడాది నుంచి ఖమ్మంలో పంపింగ్ వెల్ రోడ్ లో ఇల్లు తీసుకుని అద్దెకు ఉంటున్నాడు.
ఈ క్రమంలో నిత్య భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. దీంతో భార్య భర్త మీద ఉన్న కోపాన్ని తన పిల్లల మీద చూపించింది. ఇద్దరు చిన్నారులు వేదిక్(7), తనిష్క్(5) లకు ఎలుకల ముందు ఇచ్చి తినిపించింది. ఆ తర్వాత తాను కూడా తిని ఆత్మహత్యయత్నంకు పాల్పడింది. కొద్ది సేపటికి పిల్లలిద్దరు వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత తల్లి కూడా కుప్పకూలీపోయింది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Read more: Niranjan Parents Video: సాక్షాత్తు కొండగట్టు అంజన్నలా పవన్ మా ఇంటికి వచ్చారు.. నిరంజన్ తల్లిదండ్రులు భావొద్వేగం.. వీడియో..
పిల్లలు ఇద్దరు విగత జీవులుగా మారినిపోయినట్లు వైద్యులు చెప్పారు. వెంటనే తల్లిని ఆస్పత్రికి తరలించగా ఆమె సిట్యువేషన్ చాలా సీరియస్ గా ఉందని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఫాదర్స్ డే రోజు మాత్రం ఒక తండ్రికి తీరని శోకంలా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.