
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ మధ్య కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇక ప్రజల్లోకి తమ విజయాలను తీసుకెళ్లాలని డిసైడ్...
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ మధ్య కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇక ప్రజల్లోకి తమ విజయాలను తీసుకెళ్లాలని డిసైడ్ అయింది. ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలకు సిద్దం కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే గోదావరి జిల్లాలే కేంద్రంగా వైసీపీ కాపు రాజకీయంలో వ్యూహం మార్చింది. కీలక అడుగులు వేస్తోంది. పార్టీ తాజా నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావటం.. మారుతున్న సమీకరణాలతో వైసీపీ కొత్త వ్యూహాలను తెర మీదకు తెస్తోంది. గోదావరి జిల్లాల్లో కొత్తగా కాపు సమీకరణాలను మొదలు పెట్టింది. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తు లు ఆధ్వర్యంలో ఆదివారం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా ఉన్న కాపు నాయకులను ఆహ్వానించామని.. బొత్స సత్యనారాయణ తదితరులు కూడా హాజరవుతారని త్రిమూర్తులు చెప్పారు వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా, పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. వివిధ జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో సమీక్షిస్తామని.. వైసీపీ కాపు నేతల సమావేశం నా ఆలోచన మాత్రమే. అధిష్ఠానానికి సంబంధం లేదని తోట త్రిమూర్తులు తెలిపారు. భవిష్యత్‌లో కూడా వైసీపీ కాపు నేతల భేటీలు జరుగుతాయని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ స్లీపర్ ఖరారు- రూట్, ముహూర్తం..!!భేటీలో కీలక అంశాల పై చర్చగోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం తో 2024 ఎన్నికల్లో వైసీపీ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాపు సామాజిక వర్గంలో మెజార్టీ ఓటర్లు కూటమికే మద్దతు ప్రకటించారు. ఇక.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తరువాత వైసీపీ కొత్త వ్యూహం మొదలు పెట్టింది. కాపు వర్గానికి దగ్గర అయ్యేందుకు.. వారితో మమేకం అయ్యేలా వ్యూహాలు సిద్దం చేస్తోంది. వైసీపీ హయాంలో అమలు చేసిన కాపు నేస్తం వంటి పథకాల పైనా లోతుగా చర్చ చేసారు. ఇదే సమయంలో పార్టీలోని కాపు నేతలంతా సమావేశం నిర్వహించి... ఏ విధంగా రాజకీయ వ్యూహాలు అమలు చేయాలనేది డిసైడ్ చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వం పైనా కాపు సామాజిక వర్గంలో వ్యక్తం అవుతున్న అభిప్రాయాలు.. తాము నిర్వహించాల్సిన పాత్ర.. భవిష్యత్ ప్రణాళికల పైన ఒక నిర్ణయానికి రానున్నారు. సమావేశాల తరువాత జగన్ సమక్షంలో కాపు నేతలు భేటీ అయి.. పార్టీ పరంగా కార్యాచరణ ప్రకటించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు వైసీపీలోని కాపు నేతల కొత్త రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.