
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్ల మధ్య నేడు రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.
మే 3న జరిగిన అసలు పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతపై తీవ్ర చర్చ జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తిన డిమాండ్ల మేరకు కేంద్ర విద్యాశాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ రీ-ఎగ్జామ్కు శ్రీకారం చుట్టాయి. ఈ పరీక్ష కేవలం విద్యార్థుల భవితవ్యాన్ని నిర్ధారించడమే కాకుండా ఏటా లక్షలాది మంది ఆధారపడే వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించే ప్రయత్నంగా నిలుస్తోంది.ఎందుకు ఈ రీ-ఎగ్జామ్? మే 3న నీట్ యూజీ 2026 పరీక్ష ముగిసిన వెంటనే, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ పలు ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఈ పరిణామాలతో రంగంలోకి దిగిన అధికారులు, విచారణ చేపట్టి చివరికి పరీక్షల సమగ్రతను కాపాడతామని హామీ ఇస్తూ రీ-ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించారు.విద్యార్థుల కోసం కొత్త నిబంధనలు ఈసారి పరీక్షా విధానంలో అధికారులు కొన్ని కీలక మార్పులు చేశారు. విద్యార్థుల సౌలభ్యం కోసం పరీక్షా సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు (మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు) పెంచారు. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులలో లెక్కలు చేయడానికి అదనపు స్థలం అవసరమనే విద్యార్థుల అభ్యర్థన మేరకు, రఫ్