
ఆదోనిలోని పాండురంగస్వామి కల్యాణ మండపంలో వివరాలు నమోదు చేసుకొంటున్న సిబ్బంది ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలు అంది
ంచి, పకడ్బందీగా వివరాలు సేకరించాలి. కానీ అలా జరగడం లేదు. ఉదాహరణకు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ పరిధిలోని 256 పోలింగ్ కేంద్రాల్లో 2.60 లక్షల మందిని సర్వే చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ క్షేత్రస్థాయిలో బీఎల్వోలు ఓటర్లను కల్యాణ మండపాలు, స్వర్ణ వార్డు కార్యాలయాలకు పిలిపించుకొని మొక్కుబడిగా వివరాలు సేకరిస్తున్నారు. వారి చేతిలో ఎన్యూమరేషన్ పత్రాలు పెట్టి వెంటనే పూరించాలని సూచిస్తున్నారు. ఆదోనిలో శనివారం బీఎల్వోలు ఓ కల్యాణ మండపానికి ఓటర్లను పిలిపించుకున్నారు. ఇలా చేస్తే ఓటర్లు స్థానికులా.. స్థానికేతరులా అనేది ఎలా తెలుస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.