
Tada Nellore NH 16: రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే చెన్నై-కోల్‌కతా ప్రధాన రవాణా కారిడార్ జాతీయ రహదారి (NH-16) విస్తరణకు సంబంధించి కీలక ముందడుగు పడింది.
ఎన్‌హెచ్-16 పరిధిలోని తడ–నెల్లూరు విభాగంతో పాటు, నెల్లూరు సిటీ బైపాస్ రోడ్డును ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల (4-Lane) నుండి ఆరు లేన్ల (6-Lane) మహామర్గంగా విస్తరించడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీ కొరకు కన్సల్టెన్సీ సేవలను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
శనివారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ‘తిక్కన హాల్’లో ఈ మెగా జాతీయ రహదారి ప్రాజెక్టుకు సంబంధించి వివిధ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక స్టేక్హోల్డర్ల (భాగస్వాముల) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేషనల్ హైవేస్ అథారిటీ (NHAI) ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ రమేష్ గణపతి, డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి, సీనియర్ హైవే డిజైన్ ఇంజనీర్ వై. మురళి తదితరులు పాల్గొని ప్రాజెక్టు ప్రాథమిక బ్లూప్రింట్‌ను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుండి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు, స్థానిక రవాణా పెరగడం వల్ల తడ నుండి నెల్లూరు వరకు నిరంతరం ట్రాఫిక్ రద్దీ ఉంటోందన్నారు. రహదారి సామర్థ్యాన్ని పెంచి, ప్రమాదాలను పూర్తిగా నివారించడంతో పాటు ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన అంతర్జాతీయ స్థాయి రవాణా సదుపాయాన్ని కల్పించడమే ఈ ఆరు లేన్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు.
సమావేశంలో పలువురు సభ్యులు లేవనెత్తిన సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా జాతీయ రహదారిపై అవసరమైన చోట ప్రత్యేక ట్రాక్ లింకేజీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా స్థానిక వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పలు ప్రధాన కూడళ్లలోని ఫ్లైఓవర్ల (ఓవర్‌బ్రిడ్జ్‌లు) కింద వాహనాలు వెళ్లేందుకు క్లియరెన్స్ ఎత్తును పెంచేలా డీపీఆర్‌లో మార్పులు చేయాలని నేషనల్ హైవేస్ అధికారులను ఆదేశించారు.ఈ విస్తరణ నివేదిక తయారీ ప్రక్రియలో అత్యాధునిక డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ సర్వేలు, కొత్తగా అవసరమయ్యే భూసేకరణ (Land Acquisition) అంచనాలు, పర్యావరణ ప్రభావ అధ్యయనాలు (EIA), పాత వంతెనల రీ-డిజైనింగ్ మరియు మొత్తం వ్యయ అంచనాలను సమగ్రంగా పొందుపరచనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక ఆరు లేన్ల రహదారి విస్తరణ పనులు పూర్తయిన తర్వాత.. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి కారిడార్‌లో రవాణా వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణాపట్నం పోర్టు కారిడార్ సహా నెల్లూరు జిల్లాలోని పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆర్థిక కార్యకలాపాలకు ఈ హైవే మెరుగుదల మరింత ఊతం ఇస్తుందన్నారు. దక్షిణ భారతదేశంలో జాతీయ రహదారుల మౌలిక వసతుల అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కీలక భాగస్వాముల సమావేశంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (NUDA) చైర్మన్ కొటంరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, నగర మేయర్ సుజాత పాల్గొన్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ (JC) మొగిలి వెంకటేశ్వర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు (RDO) నాగ అనూష, అరుణా దేవి, రహదారి విస్తరణ పరిధిలోకి వచ్చే మండలాల తహసీల్దార్లు, ల్యాండ్ ఎక్విజిషన్ అధికారులు మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొని డీపీఆర్ కన్సల్టెన్సీకి పలు క్షేత్రస్థాయి సలహాలను అందించారు.
Deputy Director Narahari : అవినీతి నరహరి.. లాకర్లలో నోట్ల కట్టలు..బంగారం చూస్తే మతి పోవాల్సిందే !!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Saikrishna : అసలు సాయికృష్ణ బతికున్నాడా ? చనిపోయాడా ? ప్రభుత్వానికి పేర్ని నాని డిమాండ్
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులు విడుదల
Palla Srinivasa Rao: భారత వైద్య రంగానికి ప్రోటిజెనిక్స్ సేవలు మార్గదర్శకం: పల్లా శ్రీనివాసరావు
Baba Ramdev: యోగాంధ్ర వేదికపై చంద్రబాబును ప్రశంసించిన బాబా రాందేవ్
Chandrababu Naidu: అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు
Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత