
ఉప్పెన మూవీ ఒక సంచలనం. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సాన మెగా హీరో వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ ఉప్పెన తెరకెక్కించాడు. యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
ఆ సినిమా సక్సెస్ లో హీరోయిన్ కృతి శెట్టి పాత్ర ఎంతగానో ఉంది. కాలేజ్ గర్ల్ గా కృతి శెట్టి గ్లామర్ కుర్రాళ్లను కట్టి పడేసింది. అప్పట్లో యువత ఆమె మాయలో పడిపోయారు. చిన్న సినిమాగా విడుదలైన ఉప్పెన పెద్ద విజయం సాధించింది. అప్పట్లో హ్యాట్రిక్ పూర్తి చేసి గోల్డెన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ వరుస విజయాలు నేపథ్యంలో రెమ్యూనరేషన్ పెంచేసింది. అయినప్పటికీ మేకర్స్ ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే బంగార్రాజు సినిమా తర్వాత ఆమెకు హిట్ లేదు. వరుస చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాయి. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో కృతి శెట్టికి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) రూపంలో ఒక అద్భుతమైన అవకాశం తలుపు తట్టింది. మరిన్ని వెబ్ స్టోరీస్ ప్రపంచంలోనే అత్యధికంగా తినే పండు ఏదో తెలుసా? రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా? ముద్దబంతి పువ్వులా శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్