
సౌథాంప్టన్: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. తొలుత భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాక్కు తాజాగా బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది.
శనివారం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. షోర్నా అక్తర్ (39; 22 బంతుల్లో), నిగర్ సుల్తానా (36; 38 బంతుల్లో), సోభానా మోస్తారీ (22; 19 బంతుల్లో) రాణించారు. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా పాక్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 100 పరుగులే చేసింది. ఓపెనర్లు మునీబా అలీ (25), గుల్ ఫెరోజా (23) శుభారంభం అందించిన మిగతా బ్యాటర్లు చేతులేత్తేశారు. బంగ్లా బౌలర్లలో నహిదా అక్తర్ 3, షంజిదా అక్తర్ మేఘ్లా 3, రబేయా ఖాన్, రితు మోని ఒక్కో వికెట్ పడగొట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హెచ్సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ మ్యాచ్లు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
హెచ్సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ మ్యాచ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా చెపాక్లో అఫ్గానిస్థాన్తో జరుగుతున్న చివరి మ్యాచ్లో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చెలరేగుతున్నాడు.