
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పటిష్ఠ చర్యలు చేపట్టింది.
రేపు (ఆదివారం, జూన్ 21) జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ కోసం శనివారం నాడు చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించింది. ప్రశ్నాపత్రాల లీకేజీకి ఏమాత్రం ఆస్కారం లేకుండా చూడటమే లక్ష్యంగా ఈ డ్రిల్ సాగింది.ఈ మాక్ డ్రిల్‌లో భాగంగా, ఎస్కార్ట్ భద్రతతో పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను చేరవేయడం, పరీక్ష అనంతరం అదే భద్రత నడుమ సమాధాన పత్రాలను సేకరించడం వంటి ప్రక్రియలను ఎన్టీఏ అధికారులు పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాలన్నింటినీ సీసీటీవీ నిఘా నీడలోకి తెచ్చారు. పరీక్ష రోజున ఎలాంటి అక్రమాలకు తావులేకుండా బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు.విద్యార్థులకు ముఖ్య సూచనలుపరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:15 గంటలకు ముగుస్తుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలను తప్పనిసరిగా తీసుకురావాలి. తేలికైన దుస్తులు (హాఫ్-స్లీవ్ షర్టులు/టీ-షర్టులు, ప్యాంట్లు), స్లిప్పర్లు లేదా తక్కువ హీల్స్ ఉన్న పాదరక్షలు ధరించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, పెద్ద బెల్ట్ బకిల్స్, బరువైన ఆభరణాలు వంటివి కేంద్రాల్లోకి అనుమతించరు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో, రద్దు చేసిన