
Ellyse Perry : ఆస్ట్రేలియా దిగ్గజ మహిళా ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 WC) చరిత్రలోనే అత్యధికంగా 50 మ్యాచ్‌లు ఆడిన ప్రపంచపు మొట్టమొదటి క్రికెటర్‌గా ఆమె అరుదైన మైలురాయిని అందుకున్నారు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా పెర్రీ ఈ అద్భుత ఘనతను తన పేరిట లిఖించుకున్నారు. విశేషం ఏమిటంటే, అటు మహిళల క్రికెట్లోనూ, ఇటు పురుషుల క్రికెట్లోనూ కలిపి ఇప్పటివరకు ఏ ఒక్క ఆటగాడు కూడా టీ20 వరల్డ్ కప్‌లలో 50 మ్యాచ్‌ల మార్కును తాకలేదు. పురుషుల క్రికెట్ దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టి పెర్రీ ఈ ఘనత సాధించడం ఆమె సుదీర్ఘ కెరీర్‌కు, నిలకడైన ప్రదర్శనకు నిదర్శనంగా నిలుస్తోంది.
Read Also : నోరు మూసుకుంటే రెడ్ కార్డే.. ఫిఫా ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన పరాగ్వే స్టార్
టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఎల్లీస్ పెర్రీ 50 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో నిలవగా.. భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 47 మ్యాచ్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (43), సుజీ బేట్స్ (43), దేవేంద్ర డోటిన్ (43) వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కేవలం అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా, భారత్‌లో జరుగుతోన్న మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తరఫున ఆడుతూ పెర్రీ ఇక్కడి అభిమానుల గుండెల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. క్రికెట్‌తో పాటు ఒకప్పుడు ఆస్ట్రేలియా జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించిన పెర్రీ.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారిణిగా అగ్రపథాన దూసుకుపోతున్నారు.
Fixed-Dose Combination Medicines : 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందుల పై కేంద్రం నిషేధం
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
FIFA World Cup: అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీపై అల్జీరియా ఫిర్యాదు
IND vs AFG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
BCCI Match Timings Changed:వైభవ్ సూర్యవంశీ ‘క్రేజ్’.. భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ మ్యాచ్ సమయాల్లో మార్పు?
Miguel Almiron: నోరు మూసుకుంటే రెడ్ కార్డే.. ఫిఫా ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన పరాగ్వే స్టార్
FIFA WC: తొలి విజయాన్ని సొంతం చేసుకున్న బ్రెజిల్
India Vs Afghanistan : అఫ్గాన్‌తో మూడో వన్డే.. టీం ఇండియా జట్టులో మార్పులు?