
Save The Tigers Season 3: డిజిటల్ స్క్రీన్‌పై ఫుల్ లెంగ్త్ కామెడీతో ప్రేక్షకులను అలరించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’.
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రల్లో వచ్చిన మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. భార్యాబాధితులైన ముగ్గురు స్నేహితుల కథగా సాగిన ఈ సిరీస్, ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ జూన్ 19 నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సరికొత్త సీజన్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
గత సీజన్ల కంటిన్యూయేషన్‌గా ఈ కథ మొదలవుతుంది. గంటా రవి (ప్రియదర్శి) భార్య హైమా (సుజాత) పోరు పడలేక గేటెడ్ కమ్యూనిటీకి మారడమే కాకుండా, రాజకీయాల్లో ఎదిగి ఎమ్మెల్యే అవుతాడు. ఇక రైటర్‌గా బిజీ అయిన రాహుల్ (అభినవ్) అవార్డులతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటుంటాడు. మరోవైపు విక్రమ్ (కృష్ణ చైతన్య) హారిక అనే అమ్మాయితో సన్నిహితంగా ఉండటం చూసి, అతని భార్య రేఖ విడాకుల నోటీసు పంపుతుంది.
read also: Samantha: తల్లి కాబోతున్న సమంత ?.. నెట్టింట బేబీ బంప్ ఫొటోలు వైరల్!
ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు మిత్రులు తప్పుడు దారులు పడతారు. రవి భూకబ్జాలకు పాల్పడటం, రాహుల్ కథలు కాపీ కొట్టడం, విక్రమ్ అమ్మాయిలను వేధించడం వంటి కారణాల వల్ల ముగ్గురిపై పోలీస్ కేసులు నమోదవుతాయి. ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఒక క్లబ్ లో మందు కొడుతూ సమావేశమవుతారు.
ఈ క్రమంలోనే ‘పెళ్లి’ అనే బంధం వల్లే తమ బతుకులు ఇలా అయ్యాయని, అసలు పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని చెప్పిన దేవతలను తిట్టడం మొదలుపెడతారు. భూలోకంలో ఈ ముగ్గురు పెడుతున్న శాపనార్థాలను ఇంద్రలోకంలో ఉన్న దేవేంద్రుడు నేరుగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దేవుడు వీరికి ఎలాంటి గుణపాఠం చెప్పాడు? అనేదే మిగతా కథ.
మొదటి రెండు భాగాలు పూర్తిగా భార్యాభర్తల గొడవలు, మధ్యతరగతి జీవితాల్లోని కామెడీ చుట్టూ తిరిగితే, ఈ మూడో సీజన్‌కు దర్శకుడు ఫాంటసీ టచ్ ఇచ్చాడు. దేవుళ్లను తిట్టడం వల్ల దేవేంద్రుడు, చిత్రగుప్తుడు వంటి పాత్రలు భూలోకానికి రావడం.. ఆ తర్వాత వీరికి హ్యూమరాయిడ్స్ (మనుషులను పోలిన మనుషులు) ఎదురవడం వంటి అంశాలతో కథ సరికొత్త మలుపు తిరుగుతుంది.
అయితే, మేకర్స్ ముందుగానే చెప్పినట్టు ఈ డ్రామా కాస్త కన్ఫ్యూజింగ్గా సాగుతుంది. ఒకేలా ఉండే డబుల్ పాత్రలు ఎంటర్ అవ్వడంతో ఆడియన్స్‌కు కథను అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. లాజిక్కు అందకుండా క్లారిటీ లోపించడం వల్ల కొంత గందరగోళం ఏర్పడుతుంది.
మొత్తంగా చూస్తే.. ‘సేవ్ ద టైగర్స్ సీజన్ 3’ ఎప్పటిలాగే కామెడీని పంచే ప్రయత్నం చేసింది. కాకపోతే ఈసారి జోడించిన ఫాంటసీ ఎలిమెంట్స్, డబుల్ రోల్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్ల మునుపటి సీజన్ల స్థాయి క్లారిటీ ఇందులో కొద్దిగా లోపించింది. అయినా సరే, వారాంతంలో టైమ్‌పాస్ కోసం ఒకసారి సరదాగా చూడొచ్చు.
Ellyse Perry : అరుదైన రికార్డు సాధించిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Samantha: తల్లి కాబోతున్న సమంత ?.. నెట్టింట బేబీ బంప్ ఫొటోలు వైరల్!
Sobhita Dhulipala: నా జీవితంలో నిన్నటి వరకు జరిగినవన్నీ మర్చిపోవాలి.. శోభిత ధూళిపాళ
Allu Arjun: బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారి కోరిక తీర్చిన అల్లు అర్జున్
James Burrows:ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ బరోస్ కన్నుమూత
Suhasini Mulay Marriage: లేటు వయసులో ఘాటు ప్రేమ.. ప్రముఖ శాస్త్రవేత్తను పెళ్లాడిన ‘లగాన్’ నటి
Actress Rukmini Vasanth: నటి రుక్మిణి వసంత్ మార్ఫింగ్ ఫోటోల కేసులో ముగ్గురు అరెస్ట్