
ఫ్రాన్స్లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని (Giorgia Meloni) తనతో ఫోటో దిగడానికి పదేపదే ప్రయత్నించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఇవాళ...
ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని (Giorgia Meloni) తనతో ఫోటో దిగడానికి పదేపదే ప్రయత్నించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఇవాళ మరోసారి చెప్పుకొచ్చారు. ఇటలీలో తన ప్రజాదరణను పెంచుకోవడానికే ఆమె అలా చేశారని ట్రంప్ ఆరోపించారు. తన ట్రూత్ సోషల్ బ్లాగ్‌లో ట్రంప్ .. ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని తనతో ఫోటో కోసం పదేపదే అడిగారన్నారు.పాకిస్థాన్ పై మెలోనీ ప్రశంసలు.. మోదీ షాకింగ్ రియాక్షన్..!ఇటలీలో ఆమె ప్రజాదరణలో వెనుకబడిపోతున్నారు. బహుశా దీనికి కారణం, ఇరాన్ అణ్వాయుధాన్ని పొందకుండా లేదా అభివృద్ధి చేయకుండా నిరోధించే విషయంలో, ఇటలీని నిజంగా ప్రేమించి, రక్షించే దేశమైన అమెరికాను ఆమె తిరస్కరించడమే కావచ్చన్నారు. కానీ ఆ విషయంలో నాటో కూడా అలాగే చేసిందని గుర్తుచేశారు. ఇటలీ ల్యాండింగ్ స్ట్రిప్‌లు లేదా రన్‌వేలను ఉపయోగించుకోవడానికి అమెరికాను అనుమతించకపోవడాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు విమర్శించారు. దీనిని ఒక పెద్ద లాజిస్టికల్ సవాలుగా అభివర్ణించారు. నీతో ఫొటోనా: ట్రంప్ కు ఇచ్చిపడేసిన మెలోనీ..!అమెరికా ఇరాన్‌ను సైనికంగా ఓడించిన తర్వాత, మెలోని వాషింగ్టన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించారని ట్రంప్ ఆరోపించారు. వద్దు బాబోయ్!!! అంటూ ట్రంప్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. నిన్న జీ7 సదస్సులో ఒక ఫోటో కోసం మెలోని తనను బతిమాలారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్య ఆ రెండు మిత్రదేశాల మధ్య తీవ్రమైన దౌత్యపరమైన వివాదానికి దారితీసింది. శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తాను ఆమెతో మాట్లాడటం పట్ల మెలోని బహుశా సంతోషించి ఉంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మెలోని.. ట్రంప్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా, ఆయనవి కల్పిత మాటలన్నారు. తన మిత్రదేశాల పట్ల ట్రంప్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదన్నారు. పైగా ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదన్నారు.