
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణంలో దిశలు చాలా కీలకమైనవి. ముఖ్యంగా దక్షిణ దిశలో బాత్రూమ్ లేదా టాయిలెట్ ఉండటం పెద్ద వాస్తు దోషంగా పరిగణించబడుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణంలో దిశలు చాలా కీలకమైనవి. ముఖ్యంగా దక్షిణ దిశలో బాత్‌రూమ్ లేదా టాయిలెట్ ఉండటం పెద్ద వాస్తు దోషంగా పరిగణించబడుతుంది. ఈ దోషం కారణంగా ఇంట్లో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, కుటుంబ కలహాలు వంటివి తలెత్తే అవకాశం ఉంది. అయితే ఇల్లు నిర్మించిన తర్వాత బాత్‌రూమ్ స్థానం మార్చడం సాధ్యం కాని పని కావడంతో, సరైన పరిహారాల ద్వారా ఈ దోషాన్ని తగ్గించుకోవచ్చు.దక్షిణ దిశలో బాత్‌రూమ్ ఎందుకు నిషేధం?వాస్తు ప్రకారం దక్షిణ దిశ అగ్ని మూలకానికి చెందినది. ఇది బలం, స్థిరత్వం, కీర్తి మరియు ధర్మాన్ని సూచిస్తుంది. ఈ దిశకు అధిపతి యముడు . యమ ధర్మరాజు పాలించే దిశ ఆ ఇంటి యజమానికి సంబంధించిన పూర్వీకులకు ఆవాసం. కనుక ఆ దిశలో బాత్ రూమ్ వారి ఆగ్రహానికి కారణం అవుతుంది. మరోవైపు బాత్‌రూమ్ నీటి మూలకంతో ముడిపడి ఉంటుంది. దక్షిణ దిశలో బాత్ రూమ్ ఉంటే జరిగే నష్టం ఇదే అగ్ని మరియు నీరు ఒకేచోట కలవడం వల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి వాస్తుదోషం కలుగుతుంది. ఇది ఇంటి సానుకూలశక్తిని బలహీనపరుస్తుంది. దక్షిణ దిశలో బాత్‌రూమ్ ఉంటే ఇంటి సభ్యులు, ముఖ్యంగా పురుషులు జీర్ణ సమస్యలు, రక్తపోటు, మానసిక ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం దెబ్బతింటుంది. అనవసర అప్పులు, ధననష్టాలు పెరుగుతాయి. కుటుంబసభ్యుల మధ్య కలహాలు, అశాంతి నెలకొంటాయి. సమాజంలో అపకీర్తి, వ్యాపారాల్లో అడ్డంకులు ఎదురవుతాయి.ఈ పరిహారాలతో వాస్తు దోషం నుండి విముక్తి ఒకవేళ దక్షిణ దిశ తప్ప బాత్ రూమ్ కట్టటానికి సరైన ప్లేస్ లేదని భావించినప్పుడు, అక్కడ బాత్ రూమ్ అనివార్యం అయినప్పుడు కొన్ని పరిహారాలు పాటిస్తే వాస్తు దోషం నుండి విముక్తి లభిస్తుంది. టాయిలెట్ సీటు చుట్టూ 2 ఇంచుల మందపాటి ఎరుపు లేదా ఆరెంజ్ రంగు టేపు అతికించండి. బాత్‌రూమ్ తలుపు బయటి వైపు మధ్యలో చిన్న వాస్తు పిరమిడ్ అమర్చండి. రాగి లేదా గాజు బౌల్‌లో సముద్రపు ఉప్పు వేసి బాత్‌రూమ్‌లో ఉంచండి. దీనిని ప్రతి వారం మార్చాలి.ఇంట్లో ఉత్తర దిశలో బాత్‌రూమ్ ఉందా? అయితే తప్పక తెలుసుకోండి! ప్రతికూలతలను నివారించటానికి ఇలా చెయ్యండి బాత్‌రూమ్ డోర్, టాయిలెట్ కవర్ ఎల్లప్పుడూ మూసి ఉంచండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ క్రమం తప్పకుండా వాడండి. గోడలకు తెలుపు, క్రీమ్ లేత రంగులు వేయండి. నలుపు, నీలం రంగులు నివారించండి. నీటి లీకేజీలు లేకుండా చూసుకోండి. ఈ పరిహారాలతో దక్షిణ దిశ టాయిలెట్ తో వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు.