
Kayadu Lohar: టాలీవుడ్ యంగ్ బ్యూటీ, కన్నడ కస్తూరి కయాదు లోహర్ సోషల్ మీడియాకు తాత్కాలికంగా బ్రేక్ (డిజిటల్ డిటాక్స్) ప్రకటిస్తూ అభిమానులకు షాకిచ్చారు.
ఈ మేరకు ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ నోట్‌ను పంచుకున్నారు. శారీరక విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత కోసం, స్క్రీన్ లైఫ్‌కు దూరంగా ఉంటూ కాస్త సమయాన్ని తన కోసం కేటాయించుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం కయాదు చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది పారడైజ్’ (The Paradise) లో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. దీనితో పాటు సౌత్‌లోని అన్ని ప్రధాన భాషల్లోనూ పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగం అయ్యారు.ఈ క్రమంలో ఆమె తన పూర్తి ఏకాగ్రతను సినిమాల పైన, తన నటన పైన ఉంచాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ సోషల్ మీడియా విరామ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. “సోషల్ మీడియా నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. మన శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో, మనసుకు కూడా అంతే విశ్రాంతి కావాలి. కొద్దిరోజులు ఈ స్క్రీన్ ప్రపంచానికి దూరంగా జరిగి, నా కోసం నేను సమయం గడపాలని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు మద్దతుగా నిలిచిన, ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నేను అందుబాటులో లేకపోయినా, నా సినిమాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ను నా టీమ్ ఈ అకౌంట్ ద్వారా షేర్ చేస్తుంది. అందరూ సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా.. త్వరలోనే మళ్లీ కలుద్దాం” అని రాసుకొచ్చారు. సినిమాల కోసం సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెడుతున్న ఈ బ్యూటీ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు, అభిమానులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.