
ఇంటర్నెట్డెస్క్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్భణీ జిల్లా యశ్వాడీ గ్రామంలోని హనుమాన్ ఆలయ మండపం పైకప్పు కూలిపోయింది (Temple slab collapses). దాంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
శిథిలాల కింద చిక్కుకుపోయిన పలువురిని స్థానికులు, పోలీసులు బయటకు తీశారు.
శనివారం కావడంతో ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. రద్దీ ఎక్కువకావడంతో మండపం పైకప్పులో కొంతభాగం, పిల్లర్ కూలిపోయింది. ఆ మండపం నిర్మాణంలో ఉండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఆకస్మిక ఘటనతో భక్తులంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. శిథిలాల కింద చిక్కుకొన్న 25 మంది భక్తులను బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.