
Tuni Girl Missing Case: ఆడుకుంటూ అటవీ ప్రాంతంలోకి వెళ్లిన చిన్నారి కనిపించకకుండా పోయి నేటికి 15 రోజులు దాటిపోయింది. అయితా చిన్నారి జాడ తెలియడం లేదు.
రోజుకో అనుమానంతో రాష్ట్రమంతా ఏవోవే ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఇప్పుడు ప్రత్యక్ష్యంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. చిన్నారి కనిపించకుండా పోయి ఇన్ని రోజులైనా ఎలాంటి క్లూ లభించకపోవడంపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన కాకినాడ పర్యటన ఖరారు కాగా.. ఈ కేసు గురించి కూడా ప్రస్తావన వచ్చిందని అధికారులు చెబుతున్నారు.