
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Fathers Day 2026 Wishes: మన జీవితాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తి తండ్రి. అలాంటి తండ్రిని గౌరవించేందుకు ప్రత్యేక రోజంటూ అవసరం లేదు. కానీ, ప్రపంచలోని ఓ పోకడ కారణంగా జూన్ నెలలోని మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా నిర్వహిస్తారు. మనకు మార్గనిర్దేశం చేస్తూ జీవితంలో బలంగా నిలిచే సపోర్ట్ నాన్న.. అలాంటి వ్యక్తి పట్ల మనం చూపించే అర్ధవంతమైన గౌరవానికి వాక్యాలు జోడించడం కష్టమే. కానీ, మనల్ని ప్రేమానురాగాలతో తీర్చిదిద్దుతున్న నాన్న కోసం కనీసం ప్రేమగా మాట్లాడిన ఓ మాటైనా జీవితాంతం గుర్తుండిపోతుంది.
ఈ క్రమంలో నేడు అనగా జూన్ 21వ తేదీన ఫాదర్స్ డేను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. ఈ రోజున తమ తండ్రులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ఎప్పటిలాగ కాకుండా కొంచెం కొత్తగా వారికి గ్రీటింగ్ కార్డ్స్ లేదా వాట్సప్ మెసేజ్ ద్వారా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తే.. ఆ తండ్రిపై మీరు చూపించే కొద్దిపాటి ప్రేమకు ఆయన ఉబ్బితబ్బిబ్బైపోతారు. విషెస్ తెలియజేసేందుకు కొన్ని కోట్స్ ఇప్పుడు మీతో పంచుకుంటున్నాము.
1) అత్యంత ప్రేమతో ప్రతి అడుగులోనూ నాకు అండగా నిలిచే నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మీరే నా గొప్ప స్ఫూర్తి.
2) నన్ను ఎల్లప్పుడూ నమ్మినందుకు ధన్యవాదాలు, నాన్న. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను.
3) మీరే నా హీరో, నా మార్గదర్శి, నా అతిపెద్ద బలం. ఫాదర్స్ డే శుభాకాంక్షలు!
4) మీరు నా తండ్రిగా ఉన్నందుకు నేను ఎంత కృతజ్ఞతతో ఉన్నానో మాటల్లో చెప్పలేను. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తునే ఉంటాను!
5) జీవితంలో ప్రతి విషయాన్ని దగ్గరుండి నేర్పిన నా నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
6) ఫాదర్స్ డే శుభాకాంక్షలు, నాన్న! మీరే నా జీవితంలో అతిపెద్ద బలం.
8) మీరే నా హీరో, ఎప్పటికీ మీ హీరోనే. ఫాదర్స్ డే శుభాకాంక్షలు!
9) నాకు ఎల్లప్పుడూ అండగా ఉన్నందుకు ధన్యవాదాలు, నాన్న.
10) మీరు లేకుండా నా జీవితం అసంపూర్ణం. ఫాదర్స్ డే శుభాకాంక్షలు!
11) మీ ప్రేమ, మార్గదర్శకత్వం వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ధన్యవాదాలు నాన్న!
12) నాన్న, మీరే నా జీవితానికి పునాది. ఫాదర్స్ డే శుభాకాంక్షలు!
13) మీరు లేకుండా నా జీవితం అసంపూర్ణం. మీకు నా ప్రేమ నాన్న!
15) ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న! నా జీవితానికి మీరే బలం.
16) మీ ప్రేమకు, మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు నాన్న.
17) మీరంటే నాకు భయమే..కానీ, చెప్పలేనంత ప్రేమ నాన్న! ఫాదర్స్ డే శుభాకాంక్షలు!?
ఫాదర్స్ డే అంటే కేవలం బహుమతులు ఇవ్వడం మాత్రమే కాదు. తరచుగా మాటల్లో చెప్పలేని భావాలను వ్యక్తపరచడం కూడా. ఒక చిన్న సందేశం తండ్రి, బిడ్డల మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుంది. చేతితో రాసిన ఉత్తరాలు, వాట్సాప్ సందేశాలు లేదా సోషల్ మీడియా పోస్టుల ద్వారా శుభాకాంక్షలు పంపడం ఒక ప్రముఖ ధోరణిగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.