
జోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు ఆనందం, శ్రేయస్సు, ప్రేమ కు మారుపేరు. ఈ శుక్ర గ్రహం జులై నెలలో తన నక్షత్రాన్ని మార్చుకోనుంది. జులై 16న పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి అడుగుపెడుతుంది.ఈ మార్పు..
నాలుగు రాశుల వారి జీవితంలో అద్భుత ప్రయోజనాలను తీసుకురానుంది.ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాల్లో అపారమైన విజయాలను పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...
జులై నెలలో శుక్ర సంచారం మేష రాశివారికి చాలా ప్రయోజనాలు అందించనుంది.ఈ సమయంలో వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది. అంతేకాకుండా, జీవితంలోకి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. దీని వల్ల సంతోషం రెట్టింపు అవుతుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఈ సమయంలో కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
శుక్రుడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల మిథున రాశివారికి కూడా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలోనూ మెరుగుదలను చూస్తారు.
తుల రాశిలో జన్మించిన వారికి శుక్ర సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతోషం, శ్రేయస్సు రెట్టింపు అవుతాయి. శుక్రుడి నక్షత్ర మార్పు...ఉద్యోగాలు చేసేవారికి మరింత ఉపయోగంగా ఉంటుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది.
శుక్రుడు ఫల్గుణి నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల మకర రాశిలో జన్మించిన వారికి ఆనందం, శ్రేయస్సు రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఎందులో పెట్టుబడులు పెట్టినా.. మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల నుంచి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు.శుక్రుడి అనుగ్రహంతో వీరి కోరికలన్నీ నిజం అవుతాయి.