
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Iran Singer Parastoo Ahmadi 74 Lashes: హిజాబ్ లేకుండా ప్రదర్శన ఇచ్చినందుకు ఓ లేడీ సింగర్‌కు 74 కొరడా దెబ్బలను శిక్షగా విధించారు. హిజాబ్ లేకుండా ఓ ఈవెంట్లో పాట పాడిన ఇరాన్ గాయని పరాస్తూ అహ్మదీకి ఇరాన్‌లోని ఖోమ్ ప్రావిన్స్‌లోని ఒక క్రిమినల్ కోర్టు ఆ బృందానికి 74 కొరడా దెబ్బల శిక్షగా విధించింది. దీంతో పాటు ఆ బృందానికి రెండేళ్లపాటు దేశం విడిచి వెళ్లకూడదని, ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేయకూడదనే ఆంక్షలను విధించింది.
2024లో ఆమె యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఒక సంగీత కచేరీకి గాను.. అహ్మదీ, సంగీతకారులతో సహా ఆమె నిర్మాణ బృందంలోని ఎనిమిది మంది సభ్యులకు శిక్ష విధించినట్లు ఓ అంతర్జాతీయ వార్తాసంస్థ నివేదించింది. ఇరాన్‌లోని ఖోమ్ ప్రావిన్స్‌లోని ఒక క్రిమినల్ కోర్టు ఆ బృందానికి 74 కొరడా దెబ్బలతో పాటు.. రెండేళ్లపాటు దేశం విడిచి వెళ్లకూడదని, అలాగే రెండేళ్ల పాటు ఎలాంటి కన్సర్ట్లలో పాల్గొనేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది.
"అసభ్యకరమైన, అనైతికమైన కంటెంట్"గా పరిగణించే కంటెంట్‌ను సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేసి వారి మర్యాదను మంటగలిపారనే ఆరోపణలు వచ్చాయి. ఈ తీర్పును ఇరాన్ న్యాయవ్యవస్థ వార్తా సంస్థ ఇంకా అధికారికంగా ప్రచురించలేదు. అయితే ఈ శిక్షను మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. అమెరికాకు చెందిన 'సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇరాన్' సంస్థకు చెందిన బహార్ గందేహరి, దేశంలో మానవ హక్కుల పరిస్థితులు పెద్దగా మారలేదనడానికి ఈ శిక్ష ఒక సాక్ష్యమని అభివర్ణించారు.
యూట్యూబ్‌లో ప్రదర్శన ఇచ్చినందుకు అహ్మదీకి కొరడా దెబ్బలు వేశారన్న వార్తలపై స్పందిస్తూ.. పాత్రికేయుడు మసీహ్ అలీనెజాద్.. ఈ చర్య మహిళల గొంతులను ఒక ముప్పుగా ఎలా పరిగణిస్తున్నారో చూపిస్తోందని, ప్రభుత్వ చర్యలను "మహిళలపై వర్ణవివక్ష" అని అభివర్ణించారు. న్యాయ నిపుణులు కూడా ఈ తీర్పును ప్రశ్నించారు. ఇరాన్ చట్టం ప్రకారం మహిళలు పాడటం లేదా సంగీతం సృష్టించడం నేరం కాదని మానవ హక్కుల న్యాయవాది మోయిన్ ఖజెలీ పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే? 2024 డిసెంబర్లో ఒక ఆన్లైన్ సంగీత కచేరీలో గాయని 'అజ్ ఖూనే జవానే వతన్' ("మాతృభూమి యువత రక్తం నుండి") అనే దేశభక్తి గీతాన్ని ప్రదర్శించడంతో ఈ వివాదం మొదలైంది. అహ్మదీ హిజాబ్ లేకుండా కనిపించడంతో, లైవ్‌స్ట్రీమ్ చేసిన ఆ ప్రదర్శన వీడియో వైరల్ అయింది.
అదే సమయంలో 27 ఏళ్ల వయసున్న గాయని.. జుట్టు విరబోసుకొని, నల్లని స్లీవ్‌లెస్ డ్రస్సు ధరించి, నలుగురు పురుషుల సంగీతకారులతో కలిసి ఆమె ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత ఆ ప్రదర్శన యూట్యూబ్‌లో లక్షలాది వీక్షణలను పొందింది. ఆ సంగీత కచేరీ ఆన్లైన్లో విడుదలైన కొద్దిసేపటికే.. అహ్మదీతో పాటు పలువురు సంగీతకారులను అధికారులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. వారిని తర్వాత విడుదల చేసినప్పటికీ, ఆ వీడియో ప్రచురణకు సంబంధించి వారిపై అధికారికంగా కేసు నమోదు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.