
Pocso E Box App: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుండి మహిళల వరకు అనేక రకాల అఘాయిత్యాలు, వేధింపులకు గురవుతున్నారు.
బస్సులు, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు అనే తేడా లేకుండా కొందరు ఉన్మాదుల వల్ల మహిళలు తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారు. సమాజంలో పరువు పోతుందనే భయంతోనో, తల్లిదండ్రులు చదువు లేదా ఉద్యోగం మాన్పిస్తారనే ఆందోళనతోనో చాలా మంది బాధితులు బయటకు చెప్పలేక నరకయాతన అనుభవిస్తున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం “పోక్సో ఈ-బాక్స్” (POCSO e-Box) అనే అద్భుతమైన డిజిటల్ వేదికను అందుబాటులోకి తెచ్చింది.
Read Also: Keesara Mother Kills Son: ప్రియుడి కోసం రెండేళ్ల కొడుకును కొట్టి చంపిన కన్నతల్లి
చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై జరిగే అక్రమాలను పోలీసుల వరకు తీసుకెళ్లడానికి వెనకాడుతుంటారు. ఈ సమస్యను దూరం చేయడానికి, ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతూ నిందితులకు కఠిన శిక్ష పడేలా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ఆధ్వర్యంలో ఈ ‘పోక్సో ఈ-బాక్స్’ పనిచేస్తుంది. బాధితులు ఎక్కడికీ వెళ్లకుండా, తమ చేతిలో ఉన్న మొబైల్ ద్వారా సులభంగా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
ఈ యాప్ లేదా పోర్టల్ ద్వారా చాలా సరళమైన పద్ధతిలో, బొమ్మల (Visuals) సహాయంతో చిన్న పిల్లలు కూడా సులభంగా అర్థం చేసుకునేలా దీనిని రూపొందించారు. మొదటగా గూగుల్ ప్లే స్టోర్ నుండి ‘POCSO e-Box’ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే ‘పోక్సో’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ఆట స్థలం (Playground), పాఠశాల (School), ఇంటర్నెట్, కుటుంబ సభ్యులు, లేదా ఇతర ప్రదేశాలను సూచించే చిత్రాలు కనిపిస్తాయి. మీకు ఎక్కడైతే వేధింపులు ఎదురయ్యాయో ఆ చిత్రానికి సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీతో పాటు జరిగిన సంఘటన గురించి క్లుప్తంగా టైప్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ యాప్‌లో వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రత్యేక నిపుణుల బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తాయి. బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి వివరాలు బయటకు రాకుండా పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులపై పోక్సో చట్టం కింద కఠిన కేసులు నమోదు చేస్తారు. కంప్లైంట్ అందిన వెంటనే ఆయా వివరాలను తక్షణమే సంబంధిత రాష్ట్ర, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారులకు (WCD) బదిలీ చేస్తారు.
Maa Inti Bangaram movie: బాక్సాఫీస్ వద్ద సమంత హవా.. రికార్డు ఓపెనింగ్స్‌పై సామ్ ఎమోషనల్ పోస్ట్!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
NEET Student Suicide: తీవ్ర ఒత్తిడితో బిల్డింగ్ పైనుంచి దూకి మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య!
Kumbhamela Monalisa: కుంభమేళా మోనాలిసా కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు.. రక్షణ కల్పించాలని ఆదేశం!
Hindus In Bangladesh : శ్రీరాముడిని అవమానించారని బంగ్లాదేశ్ హిందువుల నిరసన
PM Modi G7 Summit: మోదీ దౌత్యానికి శశి థరూర్ జై.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయ రచ్చ!
NEET UG 2026 Re-Exam:రేపే నీట్ రీ-ఎగ్జామ్.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన NTA గైడ్‌లైన్స్ ఇవే!
‘Abused’at Kerala Worship Centre : కేరళలోని ఒక ప్రార్థనా కేంద్రంలో పిల్లలపై వేధింపులు