గుండె బలహీనంగా మారిన వ్యక్తుల్లో శ్వాస సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుందని డాక్టర్ సాగర్ షా, కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, శేషాద్రిపురం తెలిపారు.
గుండె బలహీనంగా మారిన వ్యక్తుల్లో ఆయాసం కూడా ఎక్కువగా వస్తుంది. చిన్న పనులకే త్వరగా అలసిపోతుంటారు.
గుండె సమస్యలు ఉన్నవారిలో పాదాలు, చీలమండల వాపులు ఎక్కువగా వస్తాయి. మీలో ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యుడ్ని కలవండి.
గుండె సమస్యలు ఉన్నవారిలో శ్వాస సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఊపిరి ఆడక రాత్రి పూట నిద్ర సరిగా రాదు. అకస్మాత్తుగా మెలకువ వస్తుంది.
రోజులో 30 నిమిషాల పాటు వాకింగ్ చేయండి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్రిస్క్ వాకింగ్ చేస్తే మరింత మేలు.
గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నవారిలో ఛాతీలో అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. ఛాతీలో నొప్పి వస్తుంది.
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండిపోతుంది. దీంతో రక్త పరిమాణం పెరుగుతుంది. దీంతో రక్తనాళాలపై ఒత్తిడి పడి, గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ కరుగుతుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది.
చక్కెర ఎక్కువగా ఉన్న స్వీట్లు, చక్కెర తినడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.