
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు SIR ప్రక్రియ కీలకంగా మారుతోంది. రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసాయి. అటు ఎన్నికల సంఘం నియమించిన అధికారులు ఈ ప్రక్రియ నిర్వహణ పైన అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతీ ఓటరుకు భరోసా ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. జరిగిన ప్రచారంతో ఈ ప్రక్రియ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలక్ష్యం చేస్తే ఓట్లు గల్లంతు అవుతాయనే హెచ్చరికలు పార్టీలు చేస్తున్నాయి. ఈ సమయంలో SIR ప్రక్రియ పైన అధికారులు కీలక అంశాలను వెల్లడిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి SIR ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూన్ 15 నుంచి జూన్24 వరకు సన్నాహక ప్రక్రియ జరుగుతుందని.. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫాం అందజేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. మిస్‌అయిన వారికి ఫాం 6తో మరోమారు ఎన్యూమరేట్ ఫాం అందజేసే అవకాశం ఉందన్నారు. జులై 31న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల చేస్తామని, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు సీఈవో వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ స్లీపర్ ఖరారు- రూట్, ముహూర్తం..!!SIR పై అధికారుల క్లారిటీఅదే విధంగా ఓటరు జాబితాలో ప్రస్తుతం ఎక్కడ ఓటు ఉందో అదే అడ్రస్‌కు ఎన్యూమరేషన్ ఫాం వస్తుందని సీఈవో తెలిపారు. ఆ అడ్రస్‌లో ఓటరు లేకపోతే అతని ఓటు అక్కడ తొలగిస్తారని స్పష్టం చేసారు. ప్రస్తుతం ఉంటున్న అడ్రస్‌తో మళ్లీ ఓటరు ఫాం8తో ఓటును ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. SIR ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమని.. ఓటర్లను తొలగించడం కాదు స్పష్టం చేశారు. 24 ఏళ్లుగా ఇక్కడ ఓటర్ జాబితా శుద్ధి జరగలేదన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది మృతి చెంది ఉంటారని.. కొందరు వలస వెళ్లి ఉంటారని తెలిపారు. వాటన్నింటినీ సరి చేయడమే SIR ఉద్దేశమని చెప్పారు. ఇందులో రాజకీయ ప్రేరేపితం ఏమీ ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పౌరునికి ఎన్యూమరేషన్ ఫాం ఇస్తారని తెలిపారు. కులం, మతంతో సంబంధం లేకుండా అందరికీ ఫాం ఇస్తారన్నారు. ఎన్యూమరేషన్‌లో ముస్లిం, హిందూ అనే వ్యత్యాసం ఉండదని చెప్పారు. ఒక వర్గం ఓట్లు తొలగిస్తారనే ఆందోళన అవసర లేదని సీఈవో సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు.