
ఒక ఫొటో చుట్టూ మొదలైన వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా మారుతోంది. బంగ్లాదేశ్‌లో రాముడి విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లామిక్ వర్గాలు చేసిన చర్యలు హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహం రేపాయి.
రాముడి చిత్రాన్ని అవమానించారనే ఆరోపణలతో వేలాది మంది హిందువులు శుక్రవారం ఢాకా వీధుల్లోకి వచ్చారు. ‘జై శ్రీరామ్’ నినాదాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు.రాజధాని ఢాకాలోని షాబాగ్ ప్రాంతం శుక్రవారం నిరసనకారులతో కిక్కిరిసిపోయింది. హిందూ మహాజోట్ పిలుపుతో విద్యార్థులు, హిందూ సంఘాలు కలిసి భారీ ప్రదర్శన చేపట్టాయి. జాతీయ ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులు, కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు. రాముడి చిత్రాన్ని అవమానించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈ నెల ప్రారంభంలో గైబంధా జిల్లాలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో కొందరు మత ఛాందసవాదులు రాముడి చిత్రంపై చెప్పు ఉంచారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైనా ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అంటున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 72 గంటల గడువు విధించాయి. అప్పటిలోగా చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి.ఉత్తర బంగ్లాదేశ్‌లోని పలాష్‌బారిలో 81 అడుగుల ఎత్తుతో రాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తైతే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహంగా నిలిచేది. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆలయ సముదాయంలో 50 అడుగుల కృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహం కూడా నిర్మించాలనే ప్రణాళిక ఉంది.విగ్రహ నిర్మాణానికి వ్యతిరేకంగా కొన్ని ఇస్లామిక్ సంస్థలు బెదిరింపులకు